
మక్తల్ రూరల్, డిసెంబర్ 17 : మండలంలోని మంథన్గోడ్లో (సీపన్న గుండ్లలో) వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో శుక్రవారం దత్త జయంతిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ఈనెల 16న ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో స్వా మి వారికి పల్లకీ సేవలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రథోత్సవంపై స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూ జలు చేశారు. రథోత్సవాన్ని తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
వల్లభాపురంలో…
మండలంలోని పస్పులలో కృష్ణానది తీరంలో వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పస్పుల దత్తపీఠం ఆధ్వర్యంలో ప్రత్యే క కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 41 రోజులపాటు దీక్షలు చేపట్టిన దత్త స్వాములు ఇరుముడులను స్వామివారికి స మర్పించి దీక్ష విరమించారు. అనంతరం స్వామివారి డో లారోహణ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. అలాగే దత్త జయంతిని పురస్కరించుకొని కర్ణాటకలోని కు ర్మపురంలో వెలిసిన దత్తాత్రేయ స్వామివారి దివ్యదర్శనం కోసం వివిధ పట్టణాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో దత్త పీఠం స్వాములు శ్రద్ధానం దస్వామీజీ, నిరంజన్ మాతాజీ, ఎంపీపీ వనజ, పస్పుల సర్పంచ్ దత్తప్ప, ఆలయ కమిటీ ప్రధానకార్యదర్శి రాంలింగారెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన కడపరాయ బ్రహ్మోత్సవాలు
మండలంలోని గున్ముక్ల గుట్టపై వెలిసిన కడపరాయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యు త్ దీపాలతో ముస్తాబు చేశారు. ఐదు రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అర్చకులు స్వామి వారిని అలంకరణ, పుష్పాలంకరణ, నైవే ద్యం, పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. 18న ఉద్దాల ఊరేగింపు, ప్రభోత్సవం, 19న రథోత్సవం, రెట్టపట్ల పోటీలు, 20న భక్తుల సేవలు, 21న పాల ఉట్ల సే వ, 22న పల్లకీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆల య కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పా ల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృ పకు పాత్రులు కావాలని వారు కోరారు.
వైభవంగా రాజమూరయ్య బ్రహ్మోత్సవాలు
మండలంలోని చిన్నరాజమూర్లో కొలువుదీరిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి పంచామృతాభిషేకం, పట్టువస్ర్తాలతో అలంకరణ, సాయంత్రం శ్రీనివాసా కల్యాణం, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి స్వామివారికి ప్రభోత్సవం నిర్వహించనున్న ట్లు ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు తెలిపారు.