
హన్వాడ, ఆగస్టు 9 : నిర్ణీత గడువులోగా చెంచుల డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఆదివా సీల దినోత్సవం సందర్భంగా మండలంలోని యారోనిప ల్లి గ్రామ సమీపంలో చెంచుల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు మంత్రి భూమి పూజ చే శారు. ఈ సందర్భంగా ఆయన 24 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇండ్లు నిర్మించుకునే వారుంటే ఉచితం గా స్థలం కేటాయిస్తామన్నారు. మరో 25 ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంత రం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంగళవారం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాల నుంచి ప్రజలు అధికంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధ నుంజయగౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచులు సుధ, రేవతి, ఎంపీటీసీ సోలిబాయి, నాయకులు రాజుయాదవ్, కరుణాకర్‌గౌడ్, రామణారెడ్డి, జంబులయ్య, లక్ష్మయ్య, బాలాగౌడ్, నరేందర్, నాగన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.
కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి..
కష్టపడి చదివితే ఉన్న త స్థాయికి చేరుకోవచ్చని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో బీటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన వి ద్యార్థులతోపాటు ఉత్తమ ఉపాధ్యాయులకు 50 మంది కి రూ.5 వేల చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలతోపాటు విదేశీ విద్యకు అవసరమైన నిధులు సమకూర్చామన్నారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్ర్తాలు ధరించాలన్నారు. మర్లు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి కల్యాణ మండప ఏర్పాటుకు మంత్రి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, డీఈవో ఉషాదేవి పాల్గొన్నారు.