
జడ్చర్లటౌన్, నవంబర్ 1 : మున్సిపాలిటీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ము మ్మరంగా కొనసాగుతున్నది. సోమవారం అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సతీశ్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది వ్యాక్సిన్ వేశారు. 26వ వార్డులో కౌన్సిలర్ ఆలూరి శశికిరణ్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమల, జరీనాబేగం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పేరూర్లో వందశాతం పూర్తి
మండలంలోని పేరూర్లో సోమవారం కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయింది. స్పె షల్ డ్రైవ్‌లో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి 18ఏండ్లు నిండిన వారందరికీ వ్యా క్సిన్ వేసి వందశాతం పూర్తి చేశారు. ఈ సం దర్భంగా వైద్యసిబ్బందిని సర్పంచ్ చామన్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.