
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 21 : అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు లబ్ధిపొందాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు కోరారు. షె డ్యూల్డ్ కులాల ఆభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన సెమినార్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎస్సీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథ కం అమలు చేస్తున్నదని, పథకం కింద విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో పీజీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంపికైన వారికి రూ.20లక్షల వరకు ఆర్థికసా యం అందిస్తున్నదన్నారు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాది కి రూ.5లక్షలకు మించకుండా, 35 ఏండ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులని, కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తారని ఆయన చెప్పారు. డిగ్రీ పరీక్ష లో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలని, అం తేకాక గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఆడ్మిషన్ పొంది ఉండాలన్నారు. ఆసక్తిగల ఎస్పీ విద్యార్థులు సద్వినియెగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎస్సీ వి ద్యార్థుల మాదిరిగానే బీసీ, ఎస్టీ విద్యార్థులకు కూడా జ్యోతిబాపులే పథకాలు ఉన్నాయని వెల్లడించారు. మెడికల్ క ళాశాలతోపాటు త్వరలోనే పాలమూరు యూనివర్సిటీలో కూడా ఇలాంటి సె మినార్ నిర్వహంచనున్నామని తెలిపా రు. సమావేశంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్ట శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల ఆభివృద్ధి శాఖ డీడీ యాద య్య, డెంటల్ కళాశాల డాక్టర్ దినేశ్, ఎస్వీఎస్ కళాశాల డాక్టర్ ఆశ్వినికుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ కిరణ్ తదితరులు హాజరయ్యారు.
భూ సేకరణను పూర్తి చేయాలి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ చివరి దశకు చేరుకున్నదని, మిగిలిపోయిన భూసేకరణను పూర్తిచేయాలని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వివిధ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల కిం ద భూసేకరణ పనులపై ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో వీసీ నిర్వహించారు. రైల్వే ప్రాజెక్టుల పనులకు సం బంధించి భూ సేకరణతోపాటు పనుల ప్రగతిని సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణను సమీక్షిస్తూ ఇప్పటివరకు దాదాపుగా భూసేకరణ పూర్తి చేశామన్నారు. పీఎన్, పీడీల పరిస్థితి ఉదండాపూర్ పునరావస కేంద్రాల పనులకు సంబంధించిన టెండర్లను 25లోగా పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా అదనపు కే టాయింపులు అవసరమైతే తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. వీసీకి రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, ఎత్తిపోతల పథకం ఎస్ఈ శ్రీనివాస్, మిషన్‌భగీరథ ఎస్ఈ వెంకటరమణ, జా తీయ రహదారులు, రైల్వే అథారిటీ ఇంజినీరింగ్ అధికారు లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నేడు వ్యాక్సినేషన్‌కు సెలవు
జిల్లావ్యాప్తంగా బుధవారం వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న యాథావిధిగా కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.