
వెల్దండ/కల్వకుర్తి రూరల్, ఆగస్టు 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నాగర్‌కర్నూల్ జిల్లాలో బీడు భూ ములన్నీ సస్యశ్యామలంగా మారుతాయని రైతులు అభిప్రాయపడ్డారు. వెల్దండ మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్హాల్లో పాలమూరు-రంగారెడ్డి రెండో ఫేజ్ కెనాల్ ఏర్పాటుపై మంగళవారం కలెక్టర్ శర్మన్ అధ్యక్షతన రాష్ట్ర కాలు ష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తాడూర్, తిమ్మాజిపేట, బిజినేపల్లి, ఊర్కొండ, వంగూర్, వెల్దండ మండలాల రైతులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు హాజ రై అభిప్రాయాలు వెల్లడించారు. కొంత మంది లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్రానికి నివేదించనున్నట్లు కలెక్టర్ పే ర్కొన్నారు. ప్రాజెక్టు ఏర్పాటు ఆవశ్యకత, ఖర్చు, ప్రయోజనాలు, నష్టంపై కాలుష్య నియంత్రణ మండలి ఏఈవో సంగీతలక్ష్మి రైతులకు వివరించారు. పలువురు రైతులు మాట్లాడుతూ కరువు, వలసల జిల్లాగా పేరున్న ఉమ్మడి పాలమూరులో పీఆర్ఎల్ఐ నిర్మాణంతో రూపురేఖలు మా రుతాయన్నారు.
పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని, ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ముక్తకంఠంతో కోరారు. ప్రాజెక్టు పూర్తయితే భూగర్భజలాలు పెరగడంతోపాటు బీడు భూములు సాగులోకి వస్తాయని, ఆదాయవనరులు పెరిగి జీవన ప్రమాణస్థాయి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, జెడ్పీటీసీలు విజితారెడ్డి, భరత్‌ప్రసాద్, వెల్దండ, చారకొండ రైతుబంధు సమితి మండలాధ్యక్షులు భాస్కర్‌రావు, యాదయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ సత్యం, సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్, జ నార్దన్‌రెడ్డి, వెల్దండ సర్పంచ్ భూపతిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, పొల్యూష న్ బోర్డు అధికారులు వే ణుగోపాలాచారి, హ న్మంత్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.