నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వ చ్చాయి. తెలంగాణ రాకముందు ముళ్ల చెట్లతో ఉన్న భూ ములు ఇప్పుడు స్వరాష్ట్రంలో పచ్చని మాగాణుల్లా మా రాయి. దీంతో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగింది. దీం తో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా ఎకరం భూమి రూ.20 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.4 కోట్ల వరకు చేరుకోవడం విశేషం. కొనడానికి గుం ట భూమి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. రా ష్ట్రం రాక ముందు ఈ ప్రాంతంలో ఎకరం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉండేది. రాష్ట్రం ఏర్పడడంతో ఎంజీకేఎల్ఐ కింద సాగునీటి వనరులు పెరిగాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 4 లక్షల ఎకరాలకు సాగునీరందగా, ప్రస్తుతం 6.50 లక్షల ఎకరాల వర కు వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఏడాది 450 వరకు చెరువుల ద్వారా యాసంగి పంటలకూ నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. దీంతో వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు విస్తృతంగా సాగవుతున్నా యి. గుంట భూమి ఉన్న రైతులు సైతం సాగు చేస్తున్నా రు. దీంతో వ్యవసాయ భూములు అమ్మడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఈ కారణాలతో భూముల ధరలు అ మాంతం పెరిగాయి. దాదాపుగా ఈ ఆరేండ్లలో 10 నుం చి 20 రెట్ల వరకు భూముల ధరలు పెరగడం గమనార్హం. జిల్లా కేంద్ర శివారులో ప్రస్తుతం ఎకరం భూమి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతున్నది. ఇ తర మండలాల్లోని రహదారులపై ఉన్న భూములు ఎక రం రూ. కోటి వరకు చేరుకున్నాయి. గ్రామ దారుల్లో రూ.50 లక్షల వరకు ఉన్నాయి.
సాధారణంగా వ్యవసా య భూమి ఎకరం రూ.20 లక్షలు పలుకుతున్నది. రోడ్డు నుంచి నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూమి మాత్రం రూ.15 లక్షలకు అటు ఇటుగా ఉన్నది. దీంతో సామాన్యులు భూములు కొనలేని పరిస్థితులు వచ్చాయి. స్థానికంగా ఉన్న రియల్టర్లతోపాటు హైదరాబాద్‌లో ఉన్న ఇక్కడి ప్రాంతాల బంధువులు, స్నేహితులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల శివారుల్లో ఎకరం రూ.3కోట్లు, హైదరాబాద్‌లో అంతకంటే ఎక్కువగా ధరతో భూములు అమ్ముకున్న రైతులు జిల్లాలోని రూ.20 లక్షల నుంచి ఉంటున్న భూములను కొనుక్కుంటున్నారు. అదే విధంగా రియల్టర్ల వల్ల కూడా భూము ల ధరలు పెరిగాయి. జిల్లా కేంద్రంతోపాటు కలెక్టరే ట్, మెడికల్ కళాశాల ఏర్పాటు చే స్తున్న ఉయ్యాలవాడ శివా రు వంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు లభించడం లేదు. ఇప్పటికే రియల్టర్లు ప్లాట్లుగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. పట్టణాల శి వారు ప్రాంతాల్లో ఎకరం రూ.కోటి వరకైనా కొనుగోలు చేస్తున్న రియల్టర్లు చేసిన వెంచర్లలో షట్టర్ షాప్‌లను రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్లాట్లను గజం కనీసం రూ.10 వేల చొప్పు న అమ్ముతున్నారు. దాదా పు హైదరాబాద్ మాదిరిగా భూముల ధరలు చేరుకున్నాయి. రియల్టర్లతోపాటు హైదరాబాద్ నుం చి వస్తున్న కొనుగోలుదార్లతో జిల్లా లో భూ దందా జో రుగా కొనసాగుతున్నది.