ఊట్కూర్, ఫిబ్రవరి 24 : ఉపాధి ప నులను జాబ్‌కార్డు కలిగి ఉన్న కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం పీడీవో కాళప్ప అన్నారు. మండలంలోని పులిమామిడి, బిజ్వారం, ఊట్కూర్ తదితర గ్రామాల్లో గురువారం ముళ్లపొదల తొలగింపు, కందకం తవ్వకాలను ఆయ న పరిశీలించారు. పనులకు హాజరైన కూ లీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులకు హాజరైన కూలీల వివరాలను మస్టర్లకు బదులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యాప్ ద్వారా నమోదు చేసేందు కు మేటీలకు అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు, టీఏ గోపాల్ పాల్గొన్నారు.
పనులపై సమీక్షా సమావేశం
నర్వ, ఫిబ్రవరి 24 : మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై గురువారం ఎంపీడీవో రమేశ్‌కుమార్, గ్రామ కార్యదర్శులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, కొత్త పనులను గుర్తించి వాటిని అధిక కూలీలను ఏర్పాటు చేసి త్వరగా పూర్తి చేయించాలని పేర్కొన్నారు. అలాగే పథకంలో సబ్సిడీపై పండ్ల తోటల పెంపకం, కూరగాయల సాగు, పందిళ్ల నిర్వహణ, షిప్ఫౌండ్ ని ర్మాణం వంటి పనులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు. నూతన కూలీల గుర్తింపునకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పంచాయ తీ కార్యదర్శులతోపాటు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.