
మహబూబ్‌నగర్, ఆగస్టు 9 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధింత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దళితబంధు పథకానికి సంబంధించి ఈ నెల 11న మండలస్థాయి సమావేశం ని ర్వహించాలని సూచించారు. సమావేశాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. రాబోయే పది రోజులు ఈ ప థకం అమలులో చాలా కీలకమన్నారు. గ్రామాల్లో ఇతర కాలనీల్లో అభివృద్ధి చెందినట్లుగానే దళితవాడలు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. దళితవాడల్లో రహదారులు, మురుగు కాల్వలు, తాగునీరు, విద్యుత్ స మస్యలు ఉండకూడదని స్పష్టం చేశారు. కొత్త పాసుపుస్తకాలు పొంది న రైతులు వెంటనే రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు సిద్ధం కావాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జాతీయ పతకాన్ని అవిష్కరిస్తారన్నారు. తెలంగాణ హరితహారం కింద వంద శాతం లక్ష్యాలు పూర్తి చేసి జిల్లాను ముందు వరుసలో ఉం చాలని ఆయన తెలిపారు. జీయో ట్యాగింగ్ పెంచాలని, ప్రజావాణి ఫిర్యాదులు, సీఎం ఫిర్యాదులు, ప్రజా వేదిక ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకూడదన్నా రు. ఎక్కడ ఎలాంటి సమస్య లు లేకుండా ప్రతి సమస్యను అధికారులు సమర్థవంతంగా పరిష్కరించుందకు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్ట ర్లు తేజస్‌నందలాల్‌పవర్, సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత పాల్గొన్నారు.
రైతుల డాటా సేకరించాలి
ఇటీవల ప్రభుత్వం రూ.50వేల రుణమాఫీ చేసేందుకు అవరసమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బ్యాంకు అధికారులు, వ్యవసాయాధికారులతో వీసీ ద్వారా మాట్లాడా రు. రైతు రుణమాఫీలో భాగంగా ప్రభత్వం మొదటి విడుత రూ.25వేలు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందేనన్నా రు. ప్రస్తుతం రూ.50వేల వరకు రుణాలు పొందిన రైతుల రుణమాఫీ చేస్తున్నందని ఆయన తెలిపారు. రుణమాఫీ పొందే రైతుల డాటాను పూర్తి స్థాయిలో సేకరించాలన్నారు. వ్యవసాయాధికారులు బ్యాంకులకు వెళ్లి డాటా తయారీ పూర్తి చేయడంలో సహకరించాలన్నారు. రెండు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఆధార్ కార్డు నంబర్, పేర్లు తప్పు వంటి డాటాను కూడా ప్రత్యేకంగా త యారు చేసి సంబంధింత రైతుల ద్వారా అవసరమై డాక్యుమెంట్స్ ఆధారంగా వాటిని కూడా సరి చేయాలన్నారు. ఎక్కడ ఎ లాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలన్నారు.
చిన్నారులను కాపాడుకోవాలి
వ్యాధుల బారిన పడకుండా చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ఫోర్సు అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. నిమోనియా, మెదడు వాపు, చెవిపోటు వంటి వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ నెల 12 నుంచి ని మొకొకల్ కంజు గేట్ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. 5, 2 ఏండ్ల లోపు చిన్నారులు నిమోనియాకు గురవుతున్నారన్నారు. నివారణ కోసం నిమొకొకల్ కంజు గేట్ వ్యా క్సిన్ వేయించాలన్నారు. పిల్లలకు 3 డోసులు, 6 వా రాలు, 14 వారాలు, 9 నెలలు లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించాలన్నారు. 4 రాష్ర్టాల్లో వ్యాక్సిన్ ప్రారంభించారన్నా రు. జిల్లాలో ముందుగా 1,400 మంది చిన్నారులకు 6 వారా ల లోపు వారికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. అనంతరం రూపొందించిన మెటీరియల్‌ను విడుదల చేశారు.