వనపర్తి, సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎ స్పీ నివాస గృహానికి భూమికేటాయించడంతోపాటు తె లంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా రెండు ఫ్లోర్లు నిర్మించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రానున్న శతాబ్ది కాలానికి ఉపయోగపడేలా పోలీస్ పరిపాలన సంబంధిత భవనాలు ఉండాలన్నదే సీఎం అభిలాష అని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో నూతనంగా నిర్మించిన ఎ స్పీ నివాస గృహాన్ని కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలోని అ న్ని కమిషనరేట్లు, జిల్లాల్లో నివాసగృహాలు నిర్మిస్తున్న ట్లు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ భవనం సమీపంలో నిర్మించిన ఎస్పీ నివాస గృహం అత్యంత ఆధునిక ప్రమాణాలతో నూతన హంగులతో ఉందన్నారు. వెనుక భాగంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ని వాసం ఉండేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. అం తకుముందు కలెక్టర్, ఎస్పీ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్‌కుమార్, కార్యాలయ ఏవో రుక్మిణీబాయి, పోలీస్ హౌసింగ్ డీఈ బాలాజీదాసు, ఏఈ అనిల్, సీఐ లు ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్‌రెడ్డి, సీతయ్య, సా యుధ దళాల ఇన్స్పెక్టర్ జగన్, ఎస్సైలు మధుసూదన్, మల్లేశ్, షేక్‌షఫీ, రాజు, వెంకటేశ్‌గౌడ్, రామస్వామి, నాగన్న, రాము, పీఆర్వో రాజాగౌడ్, సిబ్బంది ఉన్నారు.
బాధితులకు అండగా సీఎంఆర్ఎఫ్..
అనారోగ్యం బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 47 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.11.31లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం బాధితులతో కలిసి అల్పాహారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, బాధితులు పాల్గొన్నారు.