
మాగనూర్, డిసెంబర్ 30 : ప్రజలందరికీ ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కా ర్యాలయంలో గురువారం ఎంపీపీ శ్యామలమ్మ అధ్యక్షతన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా ఆడబిడ్డలకు అన్నగా ఓ తండ్రిల సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలందరూ బాగుండాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఆర్థికసాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా కల్యాణలక్ష్మి నిలుస్తుందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రైతుబంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు తీసుకురావడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రాజు, మధుసూదన్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తిప్పయ్య, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో సుధకార్రెడ్డి, ఆర్ఐ నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. మండలకేంద్రంలోని నల్లగట్టు మారెమ్మ ఆలయ పునర్ని ర్మాణం చేపడుతుండడంతో రోడ్డుకు దగ్గరలో ఉన్నందువల్ల పనులు నిలిపి వేయాలని ఆర్డీవో నోటీసులు జారీ చేశారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయానికి కొ న్ని వందలఏండ్ల చరిత్ర ఉందన్నారు. మారెమ్మ ఆలయానికి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తారన్నారు. ఆలయానికి స్థలం వదిలి ప్రభుత్వ స్థలాల్లో రోడ్డు విస్తరణ పను లు చేపట్టాలని ఆర్డీవో వెంకటేశ్వర్లుకు సూచించారు. ఆలయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రహదారి నిర్మించుకోవాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.