నాగర్‌కర్నూల్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటు లో ఉండడంలో అంగన్వాడీలు, పంచాయతీ కార్యదర్శులే ముందు వరుసలో ఉంటారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వేతనాలు పెంచి గౌరవం కల్పించింది. దీంతో విధి నిర్వహణలో మరింత సా మర్థ్యం ప్రదర్శించే అవకాశం ఉన్నది. అంగన్వాడీ లు గర్బిణులు, బాలింతలకు, నవజాత శిశువులకు ఎన్నో సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ పౌష్టికాహారా న్ని అందజేయడంతోపాటు ఆరోగ్య సలహాలిస్తున్నా రు. కరోనా సమయంలోనూ తమ వంతు సేవలందించారు. ఈ క్రమంలో వారికి 30శాతం చొప్పున జీతాలు పెంచడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన త ర్వాత ప్రభుత్వం జీతాలు రెండోసారి పెంచింది. ప్ర స్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.10,500 చొప్పున వేతనాలు వస్తున్నాయి. ప్రభుత్వం తా జాగా రూ.3,150 పెంచింది. దీంతో ప్రతి నెలా రూ.13,650 వేతనం అందుకోనున్నారు. ఇక హె ల్పర్లకు సైతం ఇప్పుడు రూ.6 వేల వేతనం వస్తుండగా.. రూ.1,800 మేర పెరిగింది. పెరిగిన వేతనాలు జూలై నుంచి వర్తించనుండడం విశేషం.
ఇక గ్రామాల అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశుధ్య చర్యలు చేపట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూ రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా పనులు చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కూడా ప్రభుత్వం ప్రేమ చాటుకున్నది. సీఎం కే సీఆర్ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి అభివృద్ధి జ రిగేలా పథకాలు అమలవుతున్నాయి. పల్లె ప్రగతి లో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు, ఇతర పనులు చేయడంతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు చేస్తూ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ ఉద్యోగులు వేతనాల పెంపుకోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (జేపీఎస్‌లు) ప్రస్తుతం నెలకు రూ.15 వేల చొప్పున వేతనాలు అందుతుండగా.., ప్రభుత్వం ఏ కంగా రూ.13,719 చొప్పున పెంచడం విశేషం. దీంతో ప్రతి నెలా రూ.28,719 చొప్పున వేతనాలు అందనున్నాయి. దీంతోపాటు ప్రొబిషనరీ పీరియడ్‌ను మరో ఏడాది పెం చారు. ప్రస్తుతం మూడేం డ్లు ఉన్న కాలాన్ని నాలుగేండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీం తో నాగర్‌కర్నూల్ జిల్లాలో 311 మంది జేపీఎస్‌లకు ప్ర యోజనం కలగనున్నది. అలాగే జిల్లాలోని 908 మంది అంగన్వా డీ టీచర్లు, 908 మంది హెల్పర్లతోపా టు 223 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు వేతనాల పెంపుతో లబ్ధి చేకూరనున్నది.
చాలా సంతోషంగా ఉంది..
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనులు చేస్తున్నాం. మాకు జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. రోజూ గ్రామంలో తిరగడం, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లడం వంటి పనులు ఉంటాయి. జీతాలు పెంచడంతో మాకు విధి నిర్వహణలో ఇంకా సేవలు అందించే ఉత్సాహం వచ్చింది.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
సీఎం కేసీఆర్ మాకు రెండు సార్లు జీతాలు పెంచారు. తొలుత నెలకు రూ.6,500 మాత్రమే ఉన్నది. ఇప్పటికే ఓసారి జీతాలు పెంచిన సీఎం ఇప్పుడు మరోసారి పెంచారు. పెరిగిన ధరలతో మా కష్టాలను గుర్తించి జీతాలు పెంచడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం.