గురువారం 04 మార్చి 2021
Mahabubabad - Jan 27, 2021 , 01:35:16

సాయి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో ఆరోగ్య శ్రీ సేవలు

సాయి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో ఆరోగ్య శ్రీ సేవలు

  • ప్రారంభించిన మంత్రి దయాకర్‌రావు

తొర్రూరు, జనవరి 26: తొర్రూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలోని సాయి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో ప్రభుత్వ అనుమతితో మంజూరైన ఆరోగ్య శ్రీ సేవలను మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థోపెడిక్‌, న్యూరో సర్జరీ, న్యూరో సంబంధిత వ్యాధులకు ఈ దవాఖానలో ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందనున్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తొర్రూరులో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దవాఖాన యాజమాన్యం డాక్టర్‌ చెరుకూరి స్వరూప్‌కుమార్‌, డాక్టర్‌ పట్టాభిరామయ్య, డాక్టర్‌ జీ రాజు, డైరెక్టర్లు ప్రొద్దుటూరి గౌరీశంకర్‌, డాక్టర్‌ సాయిభార్గవ్‌, డాక్టర్‌ నరేశ్‌, డాక్టర్‌ భిక్షపతి, డాక్టర్‌ వేణుమాధవ్‌, శ్రీధర్‌, కిశోర్‌, పాషా, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, డీఎస్పీ వెంకటరమణ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo