శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mahabubabad - Jan 23, 2021 , 00:31:46

భూక్యా లక్ష్మికి అరుదైన అవకాశం

భూక్యా లక్ష్మికి అరుదైన అవకాశం

  • గణతంత్ర దినోత్సవాన ప్రధానితో మాట్లాడే చాన్స్‌
  • ‘పొదుపు’లో సాధించిన విజయానికి గుర్తింపు
  • గడ్డిగూడెంలో గిరిజనుల స్వయం ఉపాధికి కృషి ఫలితం 
  • గ్రామైక్య సంఘం అధ్యక్షురాలికి 
  • గ్రామస్తుల అభినందనలు

మహబూబాబాద్‌ రూరల్‌ జనవరి 22 : కష్టం వస్తే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం.. వాటిని తీర్చేందుకు తిరిగి కష్టాల్లో కూరుకుపోతున్న గిరిజనుల జీవితాల్లో ‘పొదుపు’తో వెలుగులు తెచ్చిన గ్రామైక్య సంఘం అధ్యక్షురాలికి అరుదైన అవకాశం వచ్చింది. మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడేనికి చెందిన గ్రామైక్య సంగం అధ్యక్షురాలు భూక్య లక్ష్మికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడే చాన్స్‌ లభించింది. పొదుపుపై ఆమెలో కలిగిన ఆలోచన.. అందరిలోనూ ఆమె కల్పించిన అవగాహన, సాధించిన విజయమే ఆమెకు ఈ అవకాశం దక్కేలా చేసింది. ఈ ఘనత సాధించిన ఆమెకు గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ గుర్తింపు రావడంపై ఆమె మాటల్లోనే.. ‘ఎనిమిదేళ్ల క్రితం నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. చావు అంచుల దాక వెళ్లొచ్చిన. జీవితం మీద ఆశలు వదులుకున్న సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేక అప్పు కోసం నానా కష్టాలు పడ్డ.చివరికి ఎక్కువ వడ్డీకి లక్షన్నర అప్పు చేసిన .హైదరాబాద్‌కు వెళ్లి పెద్దాస్పత్రిలో వైద్యం చేయించుకున్నాక బతికిన. కానీ, అప్పు తీర్చేందుకు చాలా కష్టాలు పడ్డ. నేను ఎదుర్కొన్న బాధలు మరొకరికి రాకూడదని ఆనాడే అనుకున్న. మా తండాలో 15 మందితో మహిళా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసి 30 రూపాయాలతో ప్రారంభించిన. అప్పటి నుంచి సంఘాన్ని నడిపిస్తున్న. పొదుపు అయితే చేస్తున్నాం గానీ, తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం అప్పుడు తెలియదు. సంఘం నుంచి రుణాలు తీసుకోవచ్చని తెలియదు. సంఘం లీడర్ల ద్వారా తెలుకుని తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం మొదలుపెట్టినం. 15 ఏళ్ల నుంచి తండాలో ఉన్న గిరిజన మహిళలతో సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందేలా వారిని చైతన్యం చేసిన. ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడి మా ఇద్దరు పిల్లలను హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివిస్తున్న.

VIDEOS

logo