యుద్ధం చేసిండు వీరుడై నిలిచిండు
పోరు చేసిండు
పొడిసే పొద్దయ్యి నిలిచిండు
కొలిచే జనం కోట్ల కొద్దీ
స్వార్థం లేని హృదయంతో
సమాజాన నిలిసిండు
మానవ హృదయంతో
మందిలో కలిసిండు
కష్టానష్టాలు చూసి
ఎమ్యినోళ్లకు ఎదురు నిలిచిండు
వందల జనంలో ఒక్కడే
ముండ్ల తొవ్వని తెలిసి
ముందడుగు యేసిండు
శివునికై తాను శిరసు వంచలే
వంచనను చూసిండు ఒదిగి ఉండలేదు
పట్టుదలతో పని తలపెట్టిండు
సాధించేదాక సమరాన్ని ఆపలే
ప్రాణానికి సిద్ధం
పట్టుదల వదలలే
అవనిపై మానవ మహాత్మమై నిలిచిండు
మానవుని గుండెలో
మందిరమై వెలసిండు
– దేవరపాగ కృష్ణయ్య 9963449579