మన నిర్లక్ష్యానికి మనమే సాక్షులం
మనం అమాయకులం, కొండలు నిశ్చలం కదలవనుకున్నాం, అవి కదిలినప్పుడు ముందుగా కరిగి కొట్టుకుపోయేది మనమూ మన విశ్వాసాలే
మనం అమాయకులం, కొండలు నిశ్చలం
కదలవనుకున్నాం, అవి కదిలినప్పుడు ముందుగా
కరిగి కొట్టుకుపోయేది మనమూ మన విశ్వాసాలే
హిమాలయం మంచును మాత్రమే కరగించలేదు
మనిషి నిర్లక్ష్యాన్ని కూడా నదులుగా మార్చింది
నదులు తమ తీరాల్ని తామే దాటలేదు
మనమే వాటి తీరాలను
కాంక్రీటుతో, స్వార్థంతో, లోభంతో కుదించేశాం
ఆ రాత్రి నీరు మనుషుల తలుపు తట్టలేదు
వారి తనువులనే ఎగరేసుకుపోయింది
ఓ తల్లి పిలిచిన బిడ్డ పేరు వరదలో కలిసిపోయింది
ఇండ్లు కూరుకుపోయాయి, చిరునామాలు అంతమయ్యాయి
ఇది ప్రకృతి తీసుకున్న ప్రతీకారం కాదు
ప్రకృతి దయామయి, మనం దానికి చేసిన గాయాలను
ఇలా ఒకరోజు మన ముందు పరిచింది
చెట్లను నరికిన మన గొడ్డలి
చివరికి మన ఇంటి పైకప్పును తాకింది
పర్వతాలను చీల్చిన యంత్రం
మన గుండెల్లోకి తోసుకొచ్చింది
నదులను బంధించిన గోడలు
ఒకరోజు మన పేర్లనే వరదలో ముంచేశాయి
నేపాల్ వరద అంటే
హిమాలయం నుంచి దిగివచ్చిన నీరు మాత్రమే కాదు
ప్రకృతి పట్ల మన అజ్ఞానం,
వ్యవస్థల నిర్లక్ష్యం, అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసం
అన్నీ కలిసి రాసిన ఒక విషాద వాక్యం
ఈ రోజు నేపాల్..
రేపు మనమో, మన ఊరో, ఏ నగరమో
హిమాలయం ఇంకా నిలిచే ఉన్నది
దాని మంచులో మన భవిష్యత్తుకు
ఓ చీలిక కనిపిస్తున్నది, వణుకు వినిపిస్తున్నది
ఆ చీలికను ఇప్పుడే పూడ్చకపోతే
రేపటి వరద మట్టి నీటితో రాదు
మన నిర్లక్ష్యానికి మనమే సాక్షులమై వస్తాం
– వారాల ఆనంద్ 9440501281
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- Himalayas
- humans
- negligence
- Snow
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

