బాలాఘాట్: గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గిరిజన విద్యార్థుల మృతికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తేందుకు దీప్కే బాలాఘాట్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో, కొందరు మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించిన సమయంలో ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
‘మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నేను స్పష్టంగా విఫలమయ్యా’ అని అన్నారు.