జలం ప్రకృతి వరం
పసిడిపంటల ఔషధం
జలాన్ని పొదుపు చేద్దాం
కరువు రాకను ఆపుదాం
జలంతోనే ఆరోగ్యం
జలంతోనే ఐశ్వర్యం
భూగర్భజలం పుడమి
పచ్చ దనాన్ని పెంచు
పాడిపంటల నిచ్చు
సిరిసంపదలు ఇచ్చు
జలమే ఆకలి తీర్చు
అన్నదాతల సంజీవని
పచ్చని పంటలకూపిరి
బీడు నేలలకు జీవం
బిందు సూక్ష్మ సేద్యం
వృక్ష సంపదకు మూలం
బహుజనులకెంతో
బహుళ ప్రయోజనం
నేలరాలే ప్రతిబొట్టు
రెపటికై దాచిపెట్టు
ప్రజలందరితో జతకట్టు
అదే నీకు తొలి మెట్టు
పచ్చదనమే ఆయువుపట్టు
పుడమికి దండం పెట్టు
ఇంటింటా ంకుడుగుంత
ఇలలోన జలనిధి
వృథానీరు పొదుపు చేస్తే
భవిష్యత్తిక తరగనిది
జలమే నాదం జలమే జీవం
భవితకు జలమే ధనం
జీవకోటి మనుగడకి
ప్రాణాధారం జలం
దానిని పొదుపు చేస్తే
కలుగును ప్రతిఫలం
జలాన్ని కాపాడుటే
మన జీవన కర్తవ్యం
పాల వెన్నెల కాంతులు
దుముకేటి జలపాతాలు
ప్రవహించే జలాలే
కలిగించు పుణ్యగతులు
వారేవ్వా జలము
చేసేవు మము పావనము!
మండుతున్న ఎండలు
బీటలు వారిన భూములు
నీరులేకాగు నాడులు
ఎండుతున్న గొంతులు
వారేవ్వా ప్రకృతి
జనమంతా పరితపించే
భానుడి ప్రతాపానికి
పరితపిస్తున్న జనాలు
బొట్టు బొట్టు నీటికొరకు
బేజారయ్యె ప్రాణాలు
నేలతల్లి పులకరిస్తే
జనమంతా హర్షించు
వేసవి కాలం తాపం
ప్రాణులు అతలాకుతలం
మేఘాలు హర్షించి
మురిపించాలి భూతలం
వారేవ్వా జలనిధి
జగతికి గొప్పనిధి