మేఘాలు వలలు విసిరాయా
చినుకులు గాలాలు వేసాయా
మనిషి
చేపపిల్లలా చిక్కుకుపోయాడు!
వాగులు స్థానబలం చూపాయా
చెరువులు నిండుకుండలయ్యాయా
మనిషి
కాగితం పడవలా కొట్టుకుపోయాడు!
ఉరుములు గర్జించాయా
మెరుపులు తళుక్కుమన్నాయా
మనిషి
గుండె చేత పట్టుకుపోయాడు!
మానవ భారతంలో
ఎన్నెన్నో ప్రకృతి పర్వాలు,
జీవితకాలంలో
ఎన్నెన్నో వికృతి దృశ్యాలు!
వానొచ్చినా
వడగాల్పొచ్చినా,
మనిషి మాత్రం
ఋషిలా నిలవడటం నేర్చుకోవాలి!
– పుట్టి గిరిధర్ 94949 62080