రాత్రి గాయం తెల్లారకముందే మానాలి
రాత్రి వేళ మందులు దొరకవు
కిటికీ ఆవల కురిసే వెన్నెలే లేపనమవ్వాలి
కిటికీ లోపల నాలుగు గోడల మధ్య చీకటిలో ఆమె
మానినా మానకపోయినా
మోములో నవ్వులు రువ్వాలి
వాకిట్లో సంధ్య రాకముందే ముగ్గు పడాలి
ఆమె నిత్య జీవన చిత్రం!
– గిరి ప్రసాద్ చెలమల్లు 94933 88201