‘సుగుణ సాహితీ సమితి-సిద్దిపేట’ ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన ‘ఉగాది బాలల కథల పోటీ-2025’లకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. 372 కథలు పోటీ కోసం రాగా, బి.రణధీర్ రాసిన ‘ఎవరు గొప్ప’ అనే కథకు ప్రథమ బహుమతి (రూ.1,500) లభించింది. యన్.సౌమ్య ‘ఎవరు తీసిన గోతిలో వారే..’ పి.మధుహాసిని ‘మానవత్వం’ కథలకు ద్వితీయ బహుమతులు (ఒక్కొక్కరికి రూ.1,000) వచ్చాయి.
యన్. శ్రీహర్షి ‘స్నేహమే బహుమతి’, ఇ.హేమ ‘తన కోపమే తనకు శత్రువు’, జి.భానుప్రకాష్ ‘బామ్మ బాట బంగారు బాట’ కథలకు తృతీయ బహుమతులు (ఒక్కొక్కరికి రూ.500) వచ్చాయి. కాగా, 21 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు (ఒక్కొక్కరికి రూ. 300) వచ్చాయి. న్యాయనిర్ణేత కందుకూరి భాస్కర్. బహుమతి ప్రదాతగా ఆచార్య మర్పడగ చెన్నకృష్ణారెడ్డి వ్యవహరించనున్నారు.
– మొసర్ల మాధవరెడ్డి, అధ్యక్షులు
– భైతి దుర్గయ్య, కన్వీనర్