వలస పాలన దుర్నీతి వాంఛ నెరగి
కలసికట్టుగా నెదిరించి కండ బలము
చూపె తెలగాణ; వీరుల చూపులందు
సూర్య కిరణాలు నిండగా చురుకు బెట్టి.
నాల్గు దిక్కులు వ్యాపించినారు రిపులు
శిరము వంచగా పరిగెత్తి చితక గొట్టి
తల్లి ఋణమును తీర్చెడి తనయు లంత
వీర వీరులు తెలగాణ పౌరులెల్ల.
ప్రాణముల త్యాగమొనరించి రణము నందు
ఆస్తి పాస్తులు పోయిన ఆంక్ష కొరకు
పట్టు విడువక పయనించి పాటు పడిరి
యిట్టి పుత్రుల యమ్మవే యీవు తల్లి!
– జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 94413 33315