నవయవ్వన యువకుడై పరుగులుతీస్తుంది. నవతెలంగాణమై ప్రగతి చూపుతుంది ఏండ్లసంది ఎతలను ఎనక్కినెట్టి.. ఎక్కుపెట్టిన విజయబాణమై దూసుకుపోతుంది. పదిసంవత్సరాల పసిబిడ్డ.. ఎవ్వరూహించని రీతిలో విజయడంకా మ్రోగిస్తుంది. స్వరాష్ట్రమై నా తెలంగాణ సిరులెన్నో కురిపిస్తుంది. ప్రతిపల్లె... ప్రతిపట్నం... పచ్చని నందనవనం. దారిపొడవునా తరువుల తోరణం. కాకతీయుల కాలంనాటి కాంతి సోయగం. కాళేశ్వరం... గోదారమ్మ ప్రవాహం. చెరువులన్నీ తామరలతో సింగారం. జలదారలతో పుడమితల్లికి అభిషేకం. పచ్చని పంటలతో భూదేవికి అలంకారం. చంద్రశేఖరుడి కృషికి దక్కిన ప్రతిఫలం. సేద్యకాడి స్వేదానికి రైతుబంధు సాయమై నిలిచింది. కష్టాలను రూపుమాపి కర్శకునికి... కనకవర్షం కురిపిస్తుంది. ధాన్యపురాసుల సిరులతో రైతన్న ఇంటిముంగిట సంతోషాల పూలతోటై నిలిచింది. తెలంగాణ గడ్డపై ఎగురుతుంది అన్నదాత జెండా. తెలంగాణ మాగానిఅంతా పచ్చని పంటలతోట. బీడీలు చుట్టేపెద్దక్కకు పెద్దన్నై.. పండుముసలవ్వకు.. పెద్దకొడుకై "ఆసరా"గా నిలిచిండు. మేనమామై "కళ్యాణలక్ష్మి" కాళ్ళుకడిగిండు. ఎండిపోయిన గొంతుకు..నీటిసెలిమె దొరికినట్లు సబ్బండజాతులకు వెలుగుదీపమై నిలిచిండు. తెలంగాణను ప్రగతిబాట పయనింపచేసిండు. భాగ్యనగరం విశ్వనగరమై పరుగులుతీస్తుంది. ప్రపంచవేధికపై ఎలుగెత్తి చాటుతోంది. ఐటీ సెక్టారులో ఎదురులేని బాద్షా. యువకెరటం కేటీఆర్ చూపుతున్న కీర్తికిరణ బావుట. నగరం నడిబొడ్డున సుందర సచివాలయం. మార్గమై దారిచూపిన అంబేడ్కరుడి విగ్రహం. అమరవీరుల త్యాగాల స్మృతివనం. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రయాణిస్తుంది ప్రగతిమార్గాన. విజయ దశాబ్ది దరహాసమై దూసుకుపోతుంది. నువ్వు నేను నడుంకట్టి..పచ్చని ప్రగతికి జనహారతులు పట్టి. ఆశయాలను సాధించగా సాగుతుంది. సంతోషాల పూలవానై కురుస్తుంది. Gone Ashok అశోక్ గోనె 9441317361...నిర్మల్