ఒక దానిది
వందేండ్ల చరిత్ర
అవకాశాలెన్నిచ్చినా
‘చే’జార్చుకున్న వైనమే!
ఇంకో దానిది
మతమెక్కిన గుర్రపు తీరు
ఆదమరిచి ఆదరించామా
విద్వేషపు కీలల్లో దహనమే!
మరో దానిది
పాలనా చరిత్ర పదేండ్ల లోపే
ఫలితాలు బేరీజు వేసుకుని చూస్తే
దేశం చూపు ఇటువైపే!
ఒకదాని మీద ఇంకోటి
దుమ్మెత్తి పోసుకుంటుంటే
బురద జల్లుకుంటుంటే
మనకు కొంత అయోమయమే!
ఇదెప్పటికీ వినోదపు క్రీడ కాదు
పసిగట్టాల్సిన విద్రోహపు జాడ
ఈవీఎంల ముందు నిలబడ్డాక
నిజమొక్కటే నిలువుటద్దం!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261