2025, జూన్ 11వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్, అబిడ్స్, హైదరాబాద్‌లో ‘రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు-2025’, ‘వరిష్ఠ పురస్కారాల ప్రదానోత్సవం’ జరుగనున్నది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సభకు ము ఖ్య అతిథిగా హాజరుకానుండగా, సమన్వయకర్తగా తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యులు రింగు రామ్మూర్తి హాజరుకానున్నారు.
‘నిరుడు కురిసిన నిప్పు-డాక్టర్ కాంచనపల్లి గోవర్ధనరాజు’, ‘మళ్లీ మనిషిలోకి- ఉదారి నారాయణ’, ‘నిర్వాణ-డాక్టర్ రా మా చంద్రమౌళి’, ‘గువ్వల చెన్నా-డాక్టర్ కాలు వ మల్లయ్య’, ‘సవారు- డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్’, ‘కోటిలింగాల తెలంగాణ ప్రాచీన చారిత్రక వ్యాసాలు-డాక్టర్ సంగనభట్ల నరసయ్య’, ‘ఏడు రంగుల జెండా-డాక్టర్ అమరవాది నీరజ’లు ఉత్తమ గ్రంథ పురస్కారాలు అందుకోనున్నా రు. కాగా, రంగరాజు పద్మజ, ఎలనాగ (నాగరాజు సురేంద్ర), డాక్టర్ ఎన్.ఆర్.వెంకటేశం, రూప్‌కుమార్ డబ్బీకార్లకు వరిష్ఠ పురస్కారాలు లభించాయి. అందరికీ ఆహ్వానం.
– డాక్టర్ జె.చెన్నయ్య