నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం-2024కు కథా రచయిత్రి శ్రీఊహ రచించిన ‘బల్కావ్’ కథల సంపుటి ఎంపికైంది.
పురస్కారంతోపాటు రూ.10 వేల నగదు, జ్ఞాపికను త్వరలో అందజేసి సత్కరించనున్నట్టు నెలపొడుపు అధ్యక్ష, కార్యదర్శులు వనపట్ల సుబ్బయ్య, వహీద్ ఖాన్ తెలిపారు.