పైన పెద్ద మేఘం !
కింద చిన్ని మొలక !
మొలకను చూస్తే
మేఘానికి పులకరింత
మరింతగా చినుకుల సంత
మబ్బు వాన వానగా
మొలక చుట్టూ పెద్డ మడుగు
వానమబ్బు మొక్కా రెండూ కలిసి
వృక్షంగా నీడలు నీడలు !
పెరుగుతుంటే మైదానం చాలటం లేదు !
ఎక్కడి పక్షులైన ఈ వృక్షం పైనే టికానా
కొమ్మల పై గానా బజాన
విదేశీ పక్షులకు చెట్టు
గ్రీన్ కొమ్మ ఇచ్చేసింది !
ఎన్ని కొమ్మలో అన్ని గూళ్లు
గూళ్ల నిండా గుడ్లు
అంతా వృక్ష సంతానం
అందరికీ తల్లి చెట్టు
కనిపించే చెట్లన్నీ దిగివచ్చిన
నీటి మబ్బులే
ఒక వృక్షం పెరగాలంటే
ఎన్నెన్నో వాన కాలాల
మేఘాలు వేర్లు వేర్లుగా
మట్టిలోకి ఇంకి పోవాలి
ఔను ! మేఘం భూమి పై కురిస్తే
చెట్లు చెట్లుగా వనమౌతుంది
అందుకే మేఘాలు
సులభంగా దిగడానికి
ఆకాశం భూమి పైకి ఎప్పుడూ
వంగినట్లే ఉంటుంది
జారుడు బండలా !!
కందాళై రాఘవాచార్య
87905 93638