పేరులోనే ప్రఖ్యాతి- పాలంపేట కీర్తి
వందేళ్ళ కిందటే కరెన్సీ నోటు పై రామప్ప
ఆలయం ముద్రింపు- రామప్పకు గుర్తింపు
అదేతెచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
దేవుని పేరు లేని దేవాలయం
చెక్కిన శిల్పి పేరుతో ప్రసిద్ధమైన దేవళం
చరిత్రలో ఎక్కడా లేని నిజం
స్ధపతి రామప్ప పేరు శాశ్వతం
ప్రపంచ ప్రఖ్యాత ఏకైక ఆలయం
హొయసల శిల్పం ,పేరిణి శివతాండవ దృశ్యాలు
దారం దోచే సన్నని రంధ్రాల నిర్మాణ స్తంభాలు
ముట్టుకుంటే సరిగమలు పలికే ఏకశిలా మూర్తి విగ్రహం ఆలయంలోపల నంది లేని ఆలయం
నీటి సాంద్రత కంటే తక్కువ సాంద్రతతో
నీటిలో తేలే ఇటుకులతో గోపుర నిర్మాణం
ఇసుకపై ఆలయ నిర్మాణం
నల్ల ,తెల్ల ,గులాబీ రంగురాళ్ల గోపుర నిర్మాణం
కాకతీయ శిల్పాలలోనే అతి పెద్ద సహస్రారకమలం
పై కప్పు భాగాన్ని మోస్తున్న ట్లున్న మదనికలు
ద్వారం వద్ద సర్వాలంకార శోభితులై
ఆహ్వానిస్తున్న మదనికలు
నల్లరాయి నందికి చిరుమువ్వల గజ్జలు, గంగ డోలు
మరి ఇంకెన్నో ఆభరణాలు
కొన్నివేల శిల్పాలు కాకతీయశిల్ప సౌందర్యానికి ప్రతీక
ప్రజారంజక రంగ మంటపం,కృష్ణ లీలలు
మృదంగ వాద్య కళాకారులు ,ఎత్తు మడమల పాదరక్షల రాజసుందరి
జాయపసేనాని విరచిత “నృత్య రత్నావళి”లోని
అభినయ ముద్రల శిల్పాలు
కొన్ని వేల శిల్పాలుగల” రామప్ప దేవాలయం
ప్రపంచ వారసత్వ సంపదగాచరిత్రలో సుస్థిరం
తెలంగాణకు తెచ్చింది కీర్తి కిరీటం .
Manne Lalitha
– మన్నె లలిత
హైదరాబాద్
జిల్లా :మేడ్చల్
చరవాణి: 741 686 32 89