అమ్మ ముద్దిస్తే
మరింత ఊపిరి పోసినట్టే
అమ్మ ముద్ద పెడితే
మరింత ఆయుష్షు నింపినట్టే,
అమ్మ చంకన ఎక్కితే
రంగులరాట్నం ఎక్కినట్టే
అమ్మ కొంగు కప్పితే
హరివిల్లు దిగి వచ్చినట్టే
ఎన్ని చేసినా ఏది చేసినా
ఎదిగేదాకా, ఎదిగినా కూడా
అందరికీ తోడు అమ్మ నీడే!
ఎవరెవరు ఎవరి ప్రాణాలు
ఎందుకు తీస్తున్నారో కానీ,
మనకు ప్రాణం పోసేది
అమ్మ మాత్రమే!
ఎవరు ఎవరి కోసం
ఎంత పోరాటం చేస్తారో కానీ,
చివరి రక్తం బొట్టు వరకు
మన కోసం పోరాడేది
అమ్మ మాత్రమే!
అమ్మకు ప్రతిరూపం అమ్మే!
అమ్మకు మరో రూపం అమ్మే!!
– పుట్టి గిరిధర్ 94949 62080