అదొక పరిమళాలు వెదజల్లే పూదోట ప్రగతి ఫలాలు విరగబూసిన నందనవనం నవనవోన్మేష అభ్యుదయ ఆలోచనల అంతరంగం తరతరాల పీడనలను తరిమికొట్టిన రణభూమి అమరవీరుల బలిదానాలు - మందమతుల మస్తిష్కాలని మేల్కొల్పిన వైనం దశాబ్దాల అక్రమాల పుట్టల్ని తవ్వి తీసిన ధీరత్వం చట్టసభల్లో మూగబోయిన నాయకత్వ శూన్యత శాపమై తెలంగాణ బీళ్ళన్నీ రోదనల వేదన ఆత్మాహుతి పాలైన అన్నదాతల అకాల మరణాలు అధికారమే అహంకారమై- ప్రాంతీయ విద్వేషం బుస కొట్టిన వేళ పదవీలాలసతే పరమావధియైన రాజకీయ దివాలాదళారులు విశ్వవేదికపై తెలంగాణ అపురూప ఆవిర్భావం ప్రకృతిపులకింతల్ని సొంతం చేసుకున్న తెలంగాణ మాగాణం దశాబ్దాల కారు చీకట్లు క్రాంతి రేఖలై పునరుజ్జీవనం జాతి జనుల క్షుద్బాధ తీర్చే పంట పొలాల పరవళ్ళు ప్రవహించే అంతర్జాతీయ ఆర్థిక ధారలు వేలపరిశ్రమలకు నెలవైన భాగ్యనగర సౌభాగ్యం జాతీయపతాకమెగరేసిన అభ్యుదయపథం. పురుడు పోసుకున్న ఆలోచనల అంతర్మథనం. ఆకాశాన్నంటే ప్రగతిదారుల అవిచ్ఛిన్న పయనం అరాచక రాజకీయ ఒరవడిని అంతం చేసిన ఆలోచనామృతం. కువిమర్శల కుతంత్రాల్ని ఛేదించిన మనో నిబ్బరం. మతోన్మాద మాలిన్యాన్ని కడిగేసిన ఆధ్యాత్మిక చింతనలు సర్వమతాల సమాదరణ- ప్రశాంత జనజీవనం ఉజ్వల భవిత సాధనకై ఉరకలేసే పాలనా దక్షత జాతి భవిత లక్ష్యించే పురోగమన పునాదులు విస్తృతమై విలసిల్లే ప్రగతిరథ చక్రాల పరుగులు నూతన శకారంభానికొక ప్రత్యామ్నాయ మార్గనిర్దేశనం. *(జూన్ 2తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భం)* -కె లక్ష్మణ్ గౌడ్ లుంబినీ, మహబూబ్ నగర్ సెల్. నెం. 9704930509