నాగలి జెండా కర్రై
నగర వీధుల్లో నడిచింది
నాగలి భూమిని వదిలి
నగరంలో ఇనుప కంచెలను
దునుమాడింది
నాగలి.. తూటాలకు
చెదరకుండా గుండె నిబ్బరంతో
నిలబడింది
నాగలి
ఆకలి దప్పిక చలి వాన ఎండలకి
చలించక కడదాకా
పాతుకుపోయింది
నాగలి
కరోనా మహమ్మారిని సైతం
లెక్కచేయక లక్ష్యం కోసం
కదనరంగంలో దూకింది
నాగలి
జల ఫిరంగులకు ఆనకట్టయి
నిలిచింది
నాగలి
నియంతృత్వ గుండెలకి
నిదుర లేకుండా చేసింది
నాగలి
నేటి పోరాట దిక్సూచిగా
దేశానికి మార్గనిర్దేశం చేసింది
ఎవ్వడైనా
తలొగ్గాల్సిందేనని తెగేసి చెప్పింది.. నాగలి
గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201