వేదాంతాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు మధ్యయుగంలో ఎందరో మహాత్ములు జన్మించారు. ఆళ్వార్లు, నయనార్లు 6వ శతాబ్దానికి ముందే తమిళ ప్రాంతంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తే 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు సామాన్యుల భాషలో మతప్రచారం చేశాడు. అన్నికులాల వారిని తన ‘అనుభవమంటపం’లో కూర్చోబెట్టి ఆధ్యాత్మిక సామాజిక పరిజ్ఞానం కల్పించాడు. ముఖ్యంగా శూద్ర, దళిత వర్గాల నుంచి కూడా అనేకమంది మహాత్మా బసవేశ్వరుడి అనుయాయులుగా మారారు.
నల్లగొండ ప్రాంతంలో ప్రసిద్ధులైన పూ దో ట జంగం బసవయ్య ఇదన్నకు లింగధారణ చేయించి పంచాక్షరి ఉపదేశించాడు. ఆ తర్వా త కాలంలో ఈ పంచాక్షరి జపంతో యోగ సాధన, విచారణ మార్గం ద్వారా జ్ఞాన సాధనచేసి తన భావాలకు అక్షరరూపం ఇచ్చి తత్వకవిగా మారాడు. అలాగే గొప్ప ఆధ్యాత్మికవేత్తగా అనేక మహిమలు ప్రదర్శించాడు. తత్వకీర్తనలు, మార్మిక భాషలో రచించి దున్న ఇద్దాసుగా మారి పోయాడు. అలాగే అతని పూజల ద్వారా, ఉపదేశాల దారా కులాలకు అతీతంగా ఇద్దాసుకు ఎందరో శిష్యులయ్యా రు.
ఆ ఆధ్యాత్మిక పరంపర అలాగే కొనసాగి తెలుగు ప్రాంతంలో పోతులూ రి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, శివరామదీక్షితులు, భాగవతుల కృష్ణప్రభువు వంటి వా రు అధ్యాత్మిక విషయాలను ‘పామర లోకం’లోకి తీసుకు వచ్చారు. దీని కొనసాగింపుగా తెలంగాణ ప్రాంతంలో ఓ మహాయోగి, తత్వకవి జన్మించాడు. ఆయనే దున్న ఇద్దాసు. నల్లగొండ జిల్లా చింతపల్లిలో క్రీ.శ 1811లో ఎల్లమ్మ, దున్న రామయ్య దంపతులకు ఇద న్న జన్మించారు. ఈ బాలుడు పెరిగి పెద్దవాడై పెద్ద రైతుల దగ్గర జీతానికి కుదిరాడు. ఆ కాలంలో జీతగాళ్లు మోటకొట్టడం, పశువులను మేపడం. దున్నడం చేసేవారు. అలాగే ఇదన్న అన్ని పనులు చేస్తూనే సంత్ రవిదాసులా ఇంటిదగ్గర చెప్పులు కుట్టడం. బొక్కెనలు, తొండాలు కుట్టడం, దండేడలు.. తా ళ్లు, మోకులు పేనడం చేసేవాడు. అయితే ఇద న్న మోటకొట్టే బావి దగ్గరకు ముగ్గురు సాధువులు తరచుగా వస్తుండేవారు. ఓసారి ఇదన్న వాళ్లను అనుసరిస్తే వాళ్లు వెళ్లి ఓ శివాలయం లో ‘నామ సంకీర్తన’ చేస్తున్నారు. తర్వాత వాళ్లను కలిస్తే వాళ్లు ఇదన్న శ్రద్ధను గమనించి అతడిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టా రు.అలా ఇదన్న మెల్లమెల్లగా తత్వచింతన మొదలు పెట్టాడు.
నల్లగొండ ప్రాంతంలో ప్రసిద్ధులైన పూ దో ట జంగం బసవయ్య ఇదన్నకు లింగధారణ చేయించి పంచాక్షరి ఉపదేశించాడు. ఆ తర్వా త కాలంలో ఈ పంచాక్షరి జపంతో యోగ సాధన, విచారణ మార్గం ద్వారా జ్ఞాన సాధనచేసి తన భావాలకు అక్షరరూపం ఇచ్చి తత్వకవిగా మారాడు. అలాగే గొప్ప ఆధ్యాత్మికవేత్తగా అనేక మహిమలు ప్రదర్శించాడు. తత్వకీర్తనలు, మార్మిక భాషలో రచించి దున్న ఇద్దాసుగా మారి పోయాడు. అలాగే అతని పూజల ద్వారా, ఉపదేశాల దారా కులాలకు అతీతంగా ఇద్దాసుకు ఎందరో శిష్యులయ్యా రు. నల్లగొండలో ఇద్దాసు జన్మించినా పాత పాలమూరు జిల్లా కొల్లాపురం వరకు అతని ప్రభావం పరివ్యాప్తి చెందింది. ఆ కాలంలో ఎందరో పటేల్ పట్వారీలు ఇద్దాసుకు శిష్యు లై ఆయన మార్గంలో నడిచారు. ఆరోగ్యం, ఐశ్వర్యం మొదలైన భౌతిక సంపదలతో పాటు అలౌకికమైన ఆత్మజ్ఞానాన్ని జనానికి అందించాడు . అందువల్లనే ప్రముఖ పరిశోధకులు డా. బిరుదురాజు రామరాజు ఇద్దాసును మాదిగ మహాయోగి అని పిలిచారు.
దున్న ఇద్దాసు రాసిన 31 తత్వాలు, 2 మేల్కొల్పులు, 5 మంగళహారతులు ప్రస్తుతం లభిస్తున్నాయి. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన పి. మహేంద్రనాథ్ ఆయన సాహిత్యాన్ని రక్షిస్తే ఇటీవల కాలంలో (2018) దున్న విశ్వనాథం, వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్ శ్రమతో ‘తెలంగాణ వికాస సమితి’ వీటిని ప్రచురించింది.
భక్తిలో ఎవరైనా పరిపూర్ణం అయితేనే జ్ఞానమార్గంలో ప్రవేశిస్తారు. జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి, భక్తిలేని జ్ఞానం అహంకారానికి దారి తీస్తుందని అంటారు. ఇద్దాసు ప్రాథమిక స్థాయిలో అలాంటి భక్తి ప్రదర్శన చేశా డు. తాను సిద్ధమార్గంలో ప్రవేశించిన గురువులను, స్థలాన్ని, తుంగతుర్తి నీలకంఠ స్వా మిని తలచుకొన్నాడు. తన మాటలు సత్యమనీ పోటు వేసిన బియ్యంతో పోల్చాడు.
పోటువేసిన బియ్యంబు పాటింపు గనుకోచాటిన వచనంబు సత్యమై నిలుచు అన్నాడు.
‘హంసమార్గం’ అంటే ఆధాత్మిక పరిభాషలో ఆత్మమార్గం అని అర్థం. హంస, అహం దగ్గరి పదాలు. చూడ్డానికి ఒకేలా అనిపిస్తాయి. హంసమార్గంలో వెళ్లే వారికి అహం అడ్డొస్తుం ది. ఆ అహం కూడా దున్నపోతులా మదం గా తామసంగా ఉంటే ‘హంసమార్గం’ సాధ్యం కాదు. అది కూడా దున్న శబ్దం’ తన ఇంటిపేరు ( ఈనాటి భాషలో కవుల కలం పేరు) తత్వకవులు తమ ముద్ర ఉండేట ట్టు చూసుకుంటారు. ఇవన్ని తన తత్వంలో చెప్పుకొచ్చాడు.
ఈదన్న జాతర నిమిషములోపల హంసాన సంకీర్తి చెందితిరా అహంకార మనియేటి దున్నపోతును బట్టి కంసాలి కత్తితో చెండితిరా తాలింగ తాలింగ శివాయ దుమికి తుంగ తత్వమే లింగయ అంటాడు.
తన అహంకారం వదిలి పెట్టిన వాడే ‘ఓంకారం’గా మారి పోతాడు. ఆ కాలంలో దళితుల్లో దున్న ఇద్దాసు సాధించిన ఈ మార్గం అనితర సాధ్యం. ఎందుకంటే ఎన్నో పల్లెలు అతనికి ఎదురేగి స్వాగతం పలికేవి. అలాగే గ్రామాల్లో అధికారం చెలాయించేవారు సైతం ఇద్దాసుకు పాదాక్రాంతమయ్యారు. ఇదొక సామాజిక విస్ఫోటనం.దున్న ఇద్దాసు ఈ మార్గంలోకి వచ్చేనాటికి కుల ‘వివక్ష’ కోరలు చాస్తున్నది. ఇద్దాసు అందరికీ పూజనీయుడు కావడం కొందరు జీర్ణించు కోలేకపోయారు. దళిత కులస్థుడైన ఇద్దాసుకు బోధనాధికారం లేదని కస్సుబుస్సుమన్నారు. దానికి ఇద్దాసు వారికి వేదాంత పరిభాషలోనే సమాధానం చెప్పాడు.
మీరయ్యవారా ?
బ్రహ్మమూగన్న వారయ్య గారూ
గజరాజుకు మారు గ్రామ సూకరిబుట్టి
గ్రామ శుద్ధి చేసి గజము నేనటియేటి
దానికీ మారూ .. మాటాడ తెలియని
వారూ దానంతవారూ.. ॥మీర॥
కామధేనువు మారు కడగోవు జన్మించి
మూతి వంచుకొని పూరి భక్షించేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ ॥మీర॥
అంటూ తన మనసులో భావాన్ని గట్టి ఉపమానాలతో అవతలి వాళ్లకు అర్థం చేయిం చే ప్రయత్నం చేశాడు. ఇద్దాసు గొప్పతనం ఇక్కడే బయట పడుతుంది. కులం విషయంలో సంఘర్షణ’ విధానం కాకుండా ఇద్దాసు సమన్వయం’ సాధించే ప్రయ త్నం చేశాడు. ఎందుకంటే ఇద్దాసు స్థితిగతులకు, కులాలకు అతీతంగా ఆనాడు సమాజంలోని చాలామం ది పెద్దలనుకొనేవారి మనస్సు జయించాడు. ఎల్లమ్మ భువనేశ్వరం (పీఠం) ఇళ్లల్లోకి తీసుకెళ్లి పూజలు చేసి ప్రజల కష్టనష్టాలను తీర్చే గురువుగా ఇద్దాసుకు పేరు ఉన్నది. ఆయనకు ‘మాతంగి’ దర్శనం అయిందని చెప్తారు. అందుకే తత్వకవిగా, యోగిగా పూజలందుకున్నాడు. అందువల్ల అతడు కు లాన్ని సమన్వయంతో జయించి ‘సామాజిక సమరసత’ సాధించాడు.
ఇద్దాసు కాలంలో తెలంగాణ అసఫ్జాహీ ల పాలనలో ఉన్నది. ఆ కాలంలో గ్రామరెవెన్యూ అధికారులు మొదలుకొని సామాన్యుల వరకు ఉర్దూ పదాలు ఉపయోగించి తెలుగు మాట్లాడేవారు. ఇద్దాసు త న తత్వాల్లో కూ డా అక్కడక్కడ ఉపయోగించా డు. అలాగే మార్మిక తత్వాలలో వేదాంత పారిభాషిక పదాలను ఉపయోగించాడు.
‘ఆరు పూవుల తోటోయమ్మ!
ఈ తోట లోపల
పదహారు లొట్టిపిట్టలుగలవే సుమ్మా
కరణాలు నలుగురు కాపులార్గురు
ఘనముగ తోటకు కావలి ఇద్దరు
అష్టాగజములు ఎనిమిదమ్మ
ఈ తోటలోపల
ఇష్టా సంపన్నుడొక్కడే సుమ్మా
ముప్పది ముగ్గురు ముసద్రీలు
నలబై నలుగురు సదరు వ్రాసెదరు
ఎప్పుడు కచ్చీరు ఎడతెగకున్నది
ముసద్రీలు, సదరు, కచ్చీరు వంటి పదాలు కన్పిస్తాయి. ఒక తత్వగీతంలో ‘వేదాంతం ’ నిక్షిప్తం చేయడం ఇద్దాసు జ్ఞానానికి గీటురాయి.
ఎంతో సంతోషకరమోయమ్మ !
ఈ తోటలోపలి వింత లెవరికి తెలియవు సుమ్మా!
తోట లోపల వింతలు, మనిషి స్వభావం, ఆ స్వభావం వెనుక ఏమేమి ఉన్నాయో ఇద్దా సు ‘మార్మిక భాష’లో చెబుతున్నాడు.
ఆరు పూవుల తోట అంటే షట్చక్రాలు, మనిషి సూక్ష్మ శరీరంలో ఆరుచక్రాలు ఉన్నాయని యోగ శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ తోట లోపల మర్మమెల్ల తేటతెల్లగా తెల్పెనమ్మ’ అంటూ ఈ సాంఖ్య బోధ చేసిన తన గురువు పెనుగొండ బసవగురుడని చెప్పుకున్నాడు.
దళిత ఉద్యమాలను అనేక దృక్కోణాల్లో చూస్తున్న ఈ కాలంలో భారతదేశంలోని దళిత తత్వవేత్తలైన తిరుప్పాణి ఆళ్వారు, చొక్కమేలా, ఘసిదాస్, హరిదాస్, రవిదాస్ సరసన నిలువదగిన దున్న ఇద్దాసు తెలంగాణ తొలి దళిత కవి కావడం గమనార్హం. ఇద్దాసు తన జీవితాన్ని ‘రెబల్’గా, వర్గవాదిగా కాకుండా ‘సమన్వయ వాది’గా మలచుకోవడం అతని సమదృష్టికి నిదర్శనం.
(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
-డాక్టర్
పి. భాస్కర యోగి