పాత్రలు ఉరుములై మాట్లాడాయి
పాత్రలు ఉడికిన సముద్రాలై మాట్లాడాయి
కొన్ని పాత్రలు
ఫెటేల్మని పగిలి ఆకాశానికి
వెదజల్లే అగ్నిపర్వతాలై మాట్లాడాయి
కథలోని పాత్రలు కావు
పాత్రల్లోని జీవితాలు మాట్లాడాయి
పాత్రలే మాట్లాడాయి
నేపథ్యాలు మాట్లాడాయి
పాత్రల్లో ఔన్నత్యం పాత్రల్లో వ్యక్తిత్వం
కులంతో రాదు మతం మీద ఆధారపడదు
ప్రాంతంచే ముడిపడదు
కక్షలు వివక్షలు పాత్రలై
ఎదిరింపులు బెదిరింపులు పాత్రలై
నిశ్శబ్దం బద్దలు చేస్తూ అమరత్వం గానం చేస్తూ
వేరే కొన్ని పాత్రలు
సుసంపన్న ప్రపంచానికి పాద ముద్రలు వేస్తూ
మరికొన్ని పాత్రలు
దుఃఖ విముక్తులను చేసే మార్గాన్వేషణలో
కాలం విసిరిన సవాళ్లకు ఇరుపక్షాల మధ్య
నిలబడ్డ వారధీ ఒక పాత్రే
మహా పాత్రే
కోటం చంద్రశేఖర్
94920 43348