ఆకాశానికి పిడకలు కొట్టి
భూమికేసి చూస్తున్నాడు మనిషి
పచ్చగా పరిచిన ప్రకృతిని
ఎవరైనా తొక్కేస్తారని
జడ చిక్కు
విడిపించుకోడానికి నేలమ్మ
బీడు సెలకపై కురుల్ని ఆరబోసి
మొక్కల్ని విదిలించుకుంటోంది
రసాయనాల సమ్మేళనంలో
మనిషి మిళితమైపోతున్నాడు
దేహాన్ని మందు బిల్లతో బ్రతికిస్తూ
కాలం వెళ్ళబుచ్చుతూ
చూపు కంటే
ముందు నడుస్తున్నాడు మనిషి
ఆరడుగుల నేలను
ఒక్క అడుగులో కలిపేస్తూ
కొలతకు సమానంగా విధి
ఒప్పందానికి సమాంతరంగా
అడుగులు వడివడిగా వేస్తున్నాడు
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636