పూలనూ ఆకుల్నీ రాల్చీ రాల్చీ
బీడువారిన చెట్టు
బిక్కు బిక్కుమంటోంది
రాలిన ఆకులూ పూరెమ్మల
గల గలల్తో భూమి
దిగాలు పడ్డది
గాలి ఒక్కసారిగా
రివ్వున వీచి
నేలను ఊడ్చేసుకుపోయింది
చెట్టు మొదలేమో
ధృడంగా నిలబడి రెప్ప వాల్చకుండా
అన్నింటినీ వీక్షిస్తోంది
ఇంతలో ఆకాశంలోంచి
నల్లటి మేఘమొకటి కిందికి దిగి
చెట్టును కావలించుకుని పలకరించింది
మబ్బు ఆత్మీయతకు కరిగిపోయి
చెట్టు బావురుమంది
తడి తడై పులకరించింది
కొమ్మ చివరన చిగురించడం మొదలెట్టింది
శిశిర వసంతాలు
చెట్టుకే కాదు
మనిషికీ అనివార్యమే
వారాల ఆనంద్
94405 01281