పురాణ మిత్యేవ న సాధు సర్వం
సచాపి కావ్యం నవమిత్య వద్యం
సంతః పరీక్షాన్య తర ద్భజంతే
మూడః పరప్రత్యయ నేయ బుద్ధిః
ఏదైనా.. పాతదైనంత మాత్రమున అంతా మంచిది అనడానికి వీలు లేదు. కొత్తదైనంత మాత్రమున పూర్తిగా నిందింపదగినది కూడా కాదు. సత్పురుషులైన వారు పరిశీలించి మంచిని మాత్రమే గ్రహిస్తారు. మూర్ఖులైనవారు మంచి చెడులను గ్రహింపలేక ఇతరుల మాటలను మాత్రమే నమ్ముదురు.
–టి.సుధాకరశర్మ