నిశ్శబ్దంగా రోదిస్తున్నది
వనాకాశం మట్టికాళ్ల తొక్కుడు బొమ్మలు
కాలుతున్న పచ్చటిననలు
తట్టుదెబ్బలతో బొటనవ్రేళ్లు
రక్తం ఒడుస్తున్న బాటలు
భయంగా కాదు
ఖాళీగా ఉంది అమ్మ ఒడి
ఉక్కు గోడల శిబిరాల్లో
ఉలికులికిపడుతున్న వాడి నీడలు
భయపెడుతున్నాయి
ఒకసారి కాదు వందలసార్లు
ఆ మాయాసింహాసనం అట్లనే విల,
విల్లాడుతూనే ఉంటది
రణక్షేత్రాల్లో పొంగించడానికి
భగీరథులు గంగను వెతుక్కుంటున్నురు
కలలు కనడం,
పాటలు పాడటం,
కవిత రాయడం
కుట్రలని వణుకు వానికి
కల కనడానికి, పాట పాడటానికి,
కవిత రాయడానికి
గుండెలోంచి ఒక్క
మాటనైనా స్పందించినా
ఒక తెగువే
ఒక పొద్దే
ఒక గెలుపే
ఇదే, ఇదే కాలం
పాటొక తూటా
పదమొక కేక
నిశ్శబ్దం బద్దలు కొట్టాల్సిన కాలం
అయితే వీరుల రక్తంతో
కాకపోతే నిరాశ్రితుల కన్నీళ్లతో…
తడిసిపోయిన నేల నుంచి
మళ్లీ మొలకల మీదే ప్రాణం
ఎన్నిసాైర్లెనా ఏరువాక సాగుతుండాలె
అన్ని సార్లు పైరు పెరుగుతుండాలె
-శ్రీరామోజు హరగోపాల్
99494 98698