తెలంగాణ
ధూం ధాం గొంతుక
ప్రభుత పనుల
పాటల వేదిక
చైతన్య భావుకతల
స్వర పేటిక
గేయాల ధ్వనిని
తెలియ జేసిన జీవిక
కానరాని లోకాలకు
కదిలి పోయింది!
సాయిచందు
ప్రభుతజీవనాడి
తంత్రులను
ప్రజలముందు
ఆటపాటలతో
ఓలలాడించే
జనులగొంతుక
మూగవోయింది..
యావత్ తెలంగాణ
ప్రజల ప్రాణనాడి
చేష్టలుడిగింది!
స్వర్గాధిపతికి
తెలంగాణ ప్రగతి
పాటల మాంత్రికుడు
తన ప్రభుతలో
ఉండాలనుకుని
దివికి తీసుకెళ్లాడేమో
నీవు లేని
నీ పాటలు
మా చెవుల్లో
ప్రతిధ్వనించిన
నీవు లేని లోటు
కన్నీటిపాటగానే
మాకు మిగిలిపోతుంది!
అమరగాయకోత్తమా!
జోహార్లు!!
సాయిచంద్
గాయకోత్తమా!
నీకిదే
మా కన్నీటి వీడ్కోలు…!!!
డాక్టర్ గన్నోజు
శ్రీనివాసాచార్య
85558 99493