నగరానికి
సోకు తలకెక్కి
సుందరీకరణ జపం చేస్తున్నది!
పారుతున్న మూసీ మురికి
ఎవరి పాపమో తేల్చకుండా
విధ్వంసానికి తెరతీస్తున్నది!
తొక్కుకుంటూ పైకొచ్చిన వాళ్లకి
దుఃఖం తెలుసనడం
అందరికీ ఎరుకైన నాటకమే!
కూల్చింది ఇల్లేనా
దశాబ్దాలుగా నిర్మించుకున్న
రక్త మాంసాల గూడది!
సోకు ఒక సాకు మాత్రమే
కూల్చివేతలే పరిష్కారమైతే
భాగ్యనగరం నిండా
యుద్ధానంతర దృశ్యాలే!
విధ్వంసం తర్వాత
తరలింపు వివేచన
తలా తోకా లేని ఆలోచనే!
అందం ఎవరికైనా ఇష్టమే
మురికివాడలు నిర్మూలించాలంటే
ముందుగా సరికొత్త మేడలు పైకి లేవాలి!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261