ఏడ్చి ఏడ్చి కర్చీఫ్ తడిసిపోయింది
దుఃఖించీ దుఃఖించీ దిండు తడిసిపోయింది
రోదించీ రోదించీ ముఖం తడిసిపోయింది
అని, లోకులు అనుకొంటారు
సానుభూతితో బాధపడతారు
ఓదార్పులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు
నిజానికీ,…
ఇవన్నీ తడిసిపోవడానికి
కన్నీళ్లలో,
వర్షం చినుకుల్లా నీళ్లుండవు,..
అందులో,…
ప్రేమలుంటాయి
బరువులుంటాయి
బాధ్యతలుంటాయి
ఫీలింగ్స్ ఉంటాయి
అవి కారినా
జారినా
రాలినా
అలజడితో పొంగి వొలికినా,..
గుండె తడిసిపోతుంది కానీ,
బట్టలు తడిసిపోవు
బిస్తర్లు తడిసిపోవు
దుప్పట్లు తడిసిపోవు
నాని నాని మనసు మాత్రం
దూదిపింజలా ముద్దవుతుంది
ఆశారాజు
93923 02245