హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో 2024 డిసెంబర్ 8న తెలంగాణ రచయితల సం ఘం పదేండ్ల సాహిత్య సభలు జరగనున్నాయి. ఈ సభలో ‘తెలంగాణ అస్తిత్వ సాహిత్యం- వర్తమాన సందర్భం’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. సాహిత్య సదస్సు, కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రారంభోపన్యాసం చేయను న్నారు. డా.నాళేశ్వరం శంకరం, డా.నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివా స్, సూర్యా ధనుంజయ్, డా.మామిడి హరికృష్ణ, కందుకూరి శ్రీరాములు, డా.వి.శంకర్, ఘనపురం దేవేందర్, సి.కాశిం, వారాల ఆనంద్, కొత్త అనిల్ కుమార్, బెల్లంకొండ సంపత్‌కుమార్, పొట్లపల్లి శ్రీనివాసరావు, కొల్లాపురం విమల, అయినంపూడి శ్రీలక్ష్మి, దేవన పల్లి వీణావాణి, దాస్యం సేనాధిపతి, డా.శ్రీరామోజు హరగోపాల్, రాఘవా చార్య, నెల్లుట్ల రమాదేవి, గజ్జెల రామ కృష్ణ తదితరులు హాజరుకానున్నారు.
పుస్తక పరిచయం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తాధ్వర్యంలో 2024 డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో వనపట్ల సుబ్బయ్య దీర్ఘకావ్యం ‘అసిపె’ పరిచయ సభ జరగనున్నది. పి.వహీద్ ఖాన్ సభాధ్యక్షత వహించనున్నారు. అతిథులుగా గోరటి వెంకన్న, జూలూ రు గౌరీశంకర్, గుంటూరు లక్ష్మీనరస య్య, ఎస్.రఘు, యాకూబ్, సంగిశెట్టి శ్రీనివాస్, సీతారాం, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఉప్పల బాలరాజు, నాగవరం బాల్ రాం, కోడెపాక కుమారస్వామి, సూర్యపల్లి శ్రీనివాస్, నారు, కందికొండ మోహన్ తదితరులు హాజరుకానున్నారు.
– నెలపొడుపు సాహిత్య
సాంస్కృతిక వేదిక ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలే జ్, పీజీ సెమినార్ హాల్లో 2024 డిసెంబర్ 5న జంబూ సాహితీ దళిత కథల సంకలనం ‘కొమ్ము’ ఆవిష్కరణ సభ జరగనున్నది. ఆచార్య సూర్యా ధనంజయ్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. డా.సిద్దెంకి యాదగిరి సభాధ్యక్షత వహిస్తారు. డా.తిప్పర్తి యాదయ్య, సతీష్ చందర్, కాశిం, జూలూరు గౌరీశంకర్, కోయి కోటేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య హాజరుకానున్నారు.
– సంపాదకులు, జంబూ సాహితీ