Human evolution has witnessed Many revolutions so far. Either, they may be Agricultural, Industrial, Comm unications Revolutions Or The socio-Cultural, politico- Economic revolutio ns. But the main Reason And cause of all these revolutions are to make the Human life better. All these revolutions have happened to curtail human agony and to enhance human ecstasy. Literature and poetry have an incredible impact in realising those ideological transformations. సహజంగా కవి, తన మనసులోని భావాలకు, ఆలోచనలకు, భావ ప్రకంపనలకు, ఊహా వ్యూహాలకు పదును పెట్టి, వాటికి అక్షర రూపం ఇచ్చి కవితల్ని అల్లుతాడు. !
సాధారణంగా కవిత్వం ఒక తన్లాట నుంచి పుడుతుంది. హృదయంలో ముప్పిరి గొ న్న భావనలన్నీ ఒక్క చోట రూపుదాల్చి ఏదో విధం గా ఈ ప్రపంచానికి వెల్లడి కావాలి అనే సంఘర్షణ నుంచి కవిత్వం పుడుతుంది. నిత్యజీవితంలో భాగం గా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రజలని, సన్నివేశాలని, సందర్భాలను, సంఘటనల్ని చూస్తూ ఉంటాం. కానీ కవి మాత్రమే స్పందించగలరు. మిగ తా వారు స్పందించినప్పటికీ కవి స్పందన లో ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. కవి స్పందనలో అను భవం మాత్రమే కాదు అనుభూతి ఉంటుంది! వేదన మాత్రమే కాదు సంవేదన ఉంటుంది. నిరాశ మాత్ర మే కాదు ఆశ కూడా ఉంటుంది! ఆంక్షలు మాత్రమే కావు ఆకాంక్షలు కూడా ఉంటాయి! అందుకే కవి ప్రతి సమాజానికి ఒక క్రాంతదర్శి. ఒక మార్గదర్శి..
కవిత్వంలో జీవన సంఘర్షణ, కన్నీళ్ళ తాలూకు వేదన, రేపటి భవిష్యత్తు పై చక్కని ఊహ, జగతి కంతటినీ మేలుకొలిపే ఒక చక్కని ఆహ్వా న భావన కలగలిసి ఉంటాయి. అందుకే కవి నిరంతరం తన కవిత్వంలో తను ఆత్మాశ్ర యంగా ఉంటూ ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ తన మనసులోని సంఘర్షణలను, సంతో షాలను, సంబురాలను పంచు కుంటుంటాడు.
కవి ఏం చేస్తాడు? అనే ప్రశ్నకు కవి నలుగురు చూసిందే చూసి నలుగురు చూడలేనిది ఈ లోకానికి వెల్లడి చేస్తాడు. కనుక కవి అవసరం ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువగా ఉన్న ది. ప్రస్తుతం మనం అలవాటు పడు తున్న డిజిటల్ కళ్లకు మించిన దార్శనికత కోణం ఎంతగానో ఉన్నది. ప్రస్తుతం ఉన్న సంక్షుభిత కాలం లో, సందిగ్ధ సమయంలో, సంక్షోభ సందర్భాలలో కవిత్వం ఒక గొప్ప సాంత్వన అవుతుందని, ఆలోచనా మృతం అవుతుందని భావించవచ్చు. అందుకే కవిత్వం నేటి అవసరం! కవులు ఈనాటి దూతలు!
అలాగే కవిత్వం ఏం చేస్తుంది? అన్న దానికి ఎన్నె న్నో శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక అంశాలు చెప్పలేని ఒక మా నవతా దీప్తులని కవిత్వం ఈ లో కానికి అందిస్తుంది. భూగోళమంతా పదార్థ వస్తు తత్త్వం (Materialism ), వినియో గ వాదం ( Consumerism), వాణిజ్యవాదం (Commerciali sm) విశ్వవిహారం చేస్తూ మనుషు లందరినీ కేవల వస్తువులుగా, మానవ సంబంధాలు (Human Relat ions) అన్నింటినీ కేవలం అవసరార్థ అనుబంధాలుగా చూస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మానవుడే నా సందేశం. మానవుడే సంగీతం.. మానవుడే మహా చైతన్యం మానవుడే మహా సంకేతం అని మానవతా వాదానికీ పట్టాభిషేకం చేయ గలిగిన ఒకే ఒక్క సృజనరూపం కవిత్వం!
సాధారణంగా సాహితీవేత్త, కవి, సృజనకారుడు ఇంట్రావర్ట్…! తన చుట్టూ ఉండే లోకంలో జరిగే సంఘటనలకు తన అంతర్గత ప్రపంచంలో మధనపడుతూ ఈ లోకపు వేదనకు కారణాంతరాలను అన్వేషిస్తూ, ఆ క్రమంలో అక్షరాలను పొదవి పట్టుకొని వాక్యాలుగా, కవితలుగా మన ముందు ఆవిష్కరిస్తాడు! కవికి కన్నీటి విలువ తెలుసు .. కవ్వింత తెలుసు.. మల్లె పరిమళం , ఆకలి ఘోష తెలుసు… చీకటిలోని అందాన్ని, వెలుగులోని అనాకారితనాన్ని చూడగలిగే అతీత దృష్టి కవి సొంతం.తనలోని ఏకాకితనాన్ని, ప్రళయాగ్నిని, పసితనాన్ని గమ్మత్తుగా, సరికొత్తగా చూడగలిగిన హృదయం కవికి ఉన్నది.
సాహిత్యం, కవిత్వం ఎవరి కోసం? అనేది మరో ప్రశ్న. మొదట సాహిత్యం చక్రవర్తుల మనోభీష్టాలకు అనుకూలంగా మొదలై, దైవ సమ్మితంగా దేవుని లీలలను కీర్తించే రచనలుగా కొనసాగింది. 19,20వ శతాబ్దాలలో వచ్చిన పరిణామాల నేపథ్యంలో కవిత్వం కవిత్వం కోసం కాదు. ప్రజల కోసం.. సామాన్యుల కోసం అనే భావన ఎల్లెడెలా వ్యాపించింది. దీనివల్ల సాహిత్య, కవిత్వ కేంద్రకం ప్రజా జీవితంగా మారింది. ప్రజాస్వామ్య ప్రపంచంలో, ప్రజలే పాల కులుగా మారిన నేపథ్యంలో ప్రజల ఆలోచనలకు, ఆకాంక్షలకు, అవసరాలకు, సమస్యలకు, సవాళ్ళకు ప్రతిబింబంగా, వారి వాణిని, వారి వెర్రికేకను, ఆవేదనను’, అశ్రువులను’, ఆక్రందనను’, ఆగ్రహా న్ని’, ధిక్కారాన్ని’ వ్యక్తం చేసే అక్షరరూపకంగా సాహిత్యం, కవిత్వం పరిణమించింది.
ఇక కవిత్వం వల్ల ఏం సాధించవచ్చు? అని అంటే భాష, సాహిత్యం పుట్టినప్పటి నుంచి, ఇప్పటివరకూ నిరూపితమైన సత్యం ఏమిటంటే కవిత్వం మను షుల్లో ఒక భావపరమైన సంచలనాన్ని, భౌతిక పరమైన ఆలోచనలను, హృదయ గతమైన స్పందనలకు దారి వేస్తుందని. ప్రస్తుతం ప్రపంచమంతా ఒకలాంటి అనిశ్చితి నెలకొన్న సందర్భం. ప్రపంచ చరిత్రలో, మానవాళి పరిణామ క్రమం లో అనిశ్చితి (Uncertainty), అభద్రత (Insecurity), అలజడి (Commotion) అపనమ్మ కం (Mistrust), అన్యాయం (Injustice), అనవసర ఆం దోళన (Unnecessary Anxi ety), అతి ఆగ్రహం (Over Aggression) లాంటి పరిణా మాలు పొడచూపిన ప్రతిసారీ సాహి త్యం, కవిత్వం వాటిని ఎదుర్కొనే సాధ నాలుగా, ఆయుధాలుగా పరిణమించాయి.
సాధారణంగా ఈ తరం యువతలో అధిక సంఖ్యాకులు టెక్నాలజీకి, ఇంటర్నెట్కు, ఇతర సాంకేతిక డిజిటల్ సాధనాలకు అలవాటు పడిపోయి, వాట్స్ అప్ జనరేషన్ నవతరంలో జీవన విలువలను, వ్యక్తిత్వపు మెలకువలను, సాంస్కృతిక మూలాలను, సాహిత్యపు తేజస్సు ను మరిచిపోతున్నది. అలాంటి యువతను సాహిత్యం వైపు ప్రోత్సహించడం ద్వారా నిర్హేతు క ద్వేష ప్రచార భావజాలాలను తిప్పికొట్టడమే కాక, సర్వమానవ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని పునఃస్థాపించవచ్చు.
At this juncture literature and poetry plays a vital role in sowing the seeds of new thought mechanisms in the minds of the masses for the betterment of life and towards a life with human dignity, interests and values. As such, the tend ency, temper and tenderness of humanity have to be respected, honored and recognized. And literature and poetry definitely pave a path towards the world where humanity replaces hatred and mutual respect replaces fanaticism.
ఇలాంటి స్థితిలో విద్వేష జ్వాలలలో రగిలి పోతున్న నవతరం యువకులకు, ఛాందస భావ పీడితులకు సరైన వెలుగులను, సన్మార్గాన్ని(RightPath), సత్క్రియను ((Right Actions), సదాశయాలను (Good Intentions) ఇవ్వగలిగింది సాహి త్యం మాత్రమే.. అందుకే ఇప్పుడు ఇలాంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగిన చైతన్యవంతమైన, సామాజిక బాధ్యతతో కూడిన, ఆలోచనాత్మకమైన సాహిత్య సృష్టి జరగాల్సి ఉన్నది. కవిత్వ దృష్టి పెరగాల్సి ఉన్నది.
(వ్యాసకర్త: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు)
డాక్టర్ ,మామిడి హరికృష్ణ