Golden Globes 2026 | అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న అడాల్సెన్స్ (Adolescence) సిరీస్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తాజాగా ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్స్ 2026 అవార్డుల్లో ఈ సిరీస్‌కు కీలక విభాగాల్లో గౌరవం దక్కింది. ముఖ్యంగా నటన విభాగాల్లో రెండు ప్రధాన అవార్డులు సొంతం చేసుకోవడంతో ఈ షో స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. ఈ సిరీస్‌లో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓవెన్ కూపర్ అత్యంత చిన్న వయసులోనే ఉత్తమ సహాయనటుడు (టీవీ సిరీస్) గా గోల్డెన్ గ్లోబ్ అందుకుని అరుదైన రికార్డు సృష్టించాడు. అతని ప్రదర్శనపై మొదటి నుంచే విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో ఈ అవార్డు అతని కెరీర్‌కు కీలక మైలురాయిగా మారింది. 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ హోటల్ లో అట్టహాసంగా జరిగింది.
అదే సమయంలో ఉత్తమ నటుడు (టీవీ సిరీస్) విభాగంలో స్టీఫెన్ గ్రాహంకు అవార్డు లభించింది. సిరీస్‌లో ఆయన పోషించిన పాత్రకు గల లోతు, భావోద్వేగాల తీవ్రత ఈ గౌరవాన్ని అందించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అవార్డు స్వీకరణ సమయంలో ఓవెన్ కూపర్ తన ఆనందాన్ని పంచుకుంటూ, తనతో కలిసి పనిచేసిన అనుభవజ్ఞులైన నటీనటుల నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రయాణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ప్రముఖ స్టాండ్-అప్ కామెడియన్ నిక్కీ గ్లేజర్‌తో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం విశేషంగా మారింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు గుర్తింపు పొందిన ప్రియాంక హాజరు ఈ వేడుకకు అదనపు ఆకర్షణగా నిలిచింది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటుల ప్రతిభకు ఈ వేడుక వేదికగా నిలిచింది
గోల్డెన్ గ్లోబ్స్ 2026 ముఖ్య విజేతలు:
ఉత్తమ నటుడు (టీవీ సిరీస్): స్టీఫెన్ గ్రాహం – అడాల్సెన్స్
ఉత్తమ నటి: రోజీ బేర్నీ – ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐ డిడ్ కిక్ యూ
ఉత్తమ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ – వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ సహాయనటుడు (టీవీ సిరీస్): ఓవెన్ కూపర్ – అడాల్సెన్స్
ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్ – సెంటిమెంట్ వాల్యూ
ఉత్తమ సహాయ నటి (సినిమా): టెయానా టేలర్ – వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ – వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్ – సెంటిమెంట్ వాల్యూ
ఉత్తమ సహాయ నటి (సినిమా): టేయానా టేలర్ – వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్: స్పిన్నర్స్
ఉత్తమ యానిమేటెడ్ మోషన్ పిక్చర్: K-Pop డీమన్ హంటర్స్
మొత్తంగా చూస్తే, అడాల్సెన్స్ సిరీస్ గోల్డెన్ గ్లోబ్స్ వేదికపై మరోసారి తన సత్తా చాటుతూ, అంతర్జాతీయ టీవీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంది.