Kasibugga | కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. 60 లక్షల విలువైన నగలు అపహరణ
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలోని బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లుగా సోమవారం ఆలయ సిబ్బంది గుర్తించారు.
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలోని బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లుగా సోమవారం ఆలయ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఆలయ ధర్మకర్త ముకుంద పండా సమాచారం అందించారు.
దొంగతనానికి గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.60 లక్షల విలువైనవి అని ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆలయంలో చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, కాశీబుగ్గలో గత ఏడాది నవంబర్ 1వ తేదీన ఏకాదశి పర్వదినాన భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Kasibugga
- Srikakulam
- theft
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

