OTT Movies | సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు అన్నీ కలర్ఫుల్గా మారిపోతాయి. ఈసారి కూడా అదే జోష్ కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల ఎంటర్టైనర్లు, ఓటీటీలో కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాయి. పండుగ వారం ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోందో ఓసారి చూద్దాం.
థియేటర్లలో పండుగ సందడి
రాజాసాబ్తో సంక్రాంతి స్టార్ట్
మారుతి-ప్రభాస్ దర్శకత్వంలో రూపొందిన ది రాజా సాబ్ చిత్రం జనవరి 9న విడుదల కాగా, ఈ సినిమాతో సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది.
మెగాస్టార్ సినిమా హిట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్, టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమా పండుగ మూడ్‌ను బలంగా సెట్ చేసింది.
మాస్ మహారాజ ఎంట్రీ
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటించారు. వినోదంతో పాటు ఫ్యామిలీ టచ్ ఉన్న కథతో ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది.
శర్వానంద్ స్పెషల్ అట్రాక్షన్
ఇద్దరు హీరోయిన్లతో శర్వానంద్ సందడి చేయబోతున్న సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. జనవరి 14న విడుదలయ్యే ఈ లవ్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సంయుక్త మీనన్, సాక్షి వైద్య కీలక పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్ మిక్స్‌తో పండుగ ఆడియన్స్‌ను టార్గెట్ చేసింది.
నవీన్ పోలిశెట్టి విలేజ్ టచ్
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ కూడా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ లవ్ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు.
ఓటీటీలోనూ ఫుల్ ఎంటర్టైన్మెంట్
థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ఈ వారం కొత్త కంటెంట్ వరుసగా విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, హిందీతో పాటు ఇంగ్లీష్ మూవీస్, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (కన్నడ సినిమా – జనవరి 12)
120 బహదూర్ (హిందీ మూవీ – జనవరి 16,
నైట్ మేనేజర్, అందెలరవమిది (తెలుగు మూవీ),
ఎల్లో (తమిళ మూవీ), ప్రెడేటర్ : బ్యాండ్ ల్యాండ్స్ (ఇంగ్లీష్ మూవీ)
నాట్ విత్ అవుట్ హోప్ (ఇంగ్లీష్ మూవీ)
జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్ (ఇంగ్లీష్ మూవీ)
పీటర్ హుజార్స్ డే (ఇంగ్లీష్ మూవీ)
నెట్ ఫ్లిక్స్
తస్కరీ (హిందీ సిరీస్ – జనవరి 14)
అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్ (వెబ్ సిరీస్ – జనవరి 14)
ది రిప్ (జనవరి 16)
జియో హాట్ స్టార్
ఇండస్ట్రీ 4 (వెబ్ సిరీస్ – జనవరి 14)
వెపన్స్, హీరో ఎక్స్, ట్రాన్: ఏరీస్
ఏ థౌజెండ్ బ్లోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2)
జీ5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ – జనవరి 16)
భా… భా… భా (మలయాళం మూవీ – జనవరి 16)
సోనీ లివ్
కాలమ్ కవల్ (మలయాళం మూవీ – జనవరి 16) ఇలా పలు భాషల సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ సంక్రాంతి వారం థియేటర్లలో సందడి, ఇంట్లో ఓటీటీ బజ్… రెండింటికీ కొదవ లేదు. కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలనుకునే వారికి ఈ పండుగ పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుంది.