తెలుగు సాహిత్య ప్రపంచంలో కథ లేదా కథా సాహిత్యానికి ఒక విశిష్ట స్థానం ఉన్నది.
‘కథ’ను అనగనగా అని మొదలుపెట్టి
‘కథ కంచికి మనం ఇంటికి’ అంటూ కథను ముగించడం తెలుగు కథకుల అలవాటు.
‘నిజ జీవితం ఆధారంగా అల్లబడిన సంఘటనల సమాహారం కథ’ అని కొందరు, ‘కల్పిత ప్రపంచ సమాహారం కథ’ అని మరికొందరు కథకు రకరకాల నిర్వచనాలను ఇచ్చారు. కథలో ఉండాల్సిన నీతి విస్తృతం, ఎత్తుగడ, సంవేదన, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, పాత్ర స్వభావాలు, ఏక వస్తు స్వరూపతల గురించి బొడ్డపాటి కుటుంబరాయ శర్మ, జె.నాగయ్య, పోరంకి దక్షిణామూర్తి వంటి అనేకమంది పండితులు అనేకరకాల అభిప్రాయాలను తెలియజేశారు.
‘అనగనగా..’ అంటే నిజంగా ‘చాలాకాలం కిందట’ అనే అర్థమేనా? కొంచెం తెలివితేటలు కలిగిన విద్యార్థి ‘అనగనగా ఒక పిల్లి ఉంది అంటే చాలాకాలం కిందట ఒక పిల్లి ఉంది’ అని అర్థం చెప్పుకోవాలా?, అలాగే ‘అనగనగా ఒక రాజు అంటే చాలాకాలం కిందట ఒక రాజే ఉన్నాడని చెప్పుకోవాలా’ అని ప్రశ్నిస్తే‘అది అంతేలేరా’ అని కొందరు గురువులు మృదువుగా మందలిస్తే, మరికొందరు గురువులు పిదప కాలం బుద్ధులు. దిక్కుమాలిన సందేహాలు అని విసుక్కుంటారు.
ఏదేమైనా ‘కథ్’ అనే సం స్కృత ధాతువు నుంచి ‘కథ’ అనే పదం పుట్టింది. ‘చెప్పు ట, సంభాషించుట’ అని దీనికి అర్థాలుగా చెప్పవచ్చు. కథల్లో ఇతి వృత్తాన్ని బట్టి పురాణ కథలు, శృం గార కథలు, హాస్యకథలు, క్రైం కథ లు, రాజకీయ కథలు, అభ్యుదయ కథలు, స్త్రీవాద కథలు, దళిత కథలు వంటివి అనేకం ఉన్నాయి. ప్రాచుర్యాన్ని బట్టి చందమామ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్ర కథలు, విక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, బేతాళ కథలు, తాతమ్మ కథలు, పిట్ట కథలు వంటి వాటితో పాటు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా తెనాలి రామకృష్ణ కథల వంటి హాస్య కథలున్నాయి. ఇంకా హరి కథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, సైన్స్ కథలు, పొడు పు కథల వంటి అనేకరకాల కథలున్నాయి. ఈ ఆధుని క కాలంలో సినిమా కథల వంటివి కూడా ఉన్నాయి. తెలుగు కథలకు నిలయమైన ‘కథా నిలయం’ అనే పేరు గల గ్రంథాలయాన్ని 1997 ఫిబ్రవరి 22న శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు స్థాపించారు.
తిక్కన శిష్యుడైన కేతన రాసిన ‘దశకుమార చరిత్ర’ కథా కావ్యం కాగా ఆధునిక కాలంలో గురజాడ వేంకట అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అనే కథ తెలుగులో తొలి కథ అని అంటారు. ఇక బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ వంటి వారు గురజాడ అప్పారావు కంటే ముందే కథా రచనకు శ్రీకారం చుట్టారు. ఆపై వేలూరి శివరామ శాస్త్రి, కొమర్రాజు వెం కటలక్ష్మణరావు, చింతా దీక్షితులు, కాళోజీ, చలం, బోయినపల్లి రంగారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ముని మాణిక్యం, బోయ జంగయ్య, పులిపాటి గురుస్వామి, అల్లం రాజయ్య, అడవి బాపిరాజు, భమిడిపాటి కామేశ్వరరావు, విశ్వనాథ సత్యనారాయణ, పీవీ, మల్లాది రామకృష్ణ శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, గూడూరి సీతారాం, సామల, యశోదారెడ్డి, అఫ్సర్, ముళ్లపూడి వెం కటరమణ, మంజుశ్రీ, చాగంటి సోమయాజులు, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, హితశ్రీ, కొలకలూరి ఇనాక్, కాలువ మల్లయ్య, వాకాటి పాండురంగారావు, భానుమతి, చెరబండరాజు, ఓల్గా, హుమాయూన్ సం ఘీర్, ధీరజ్ కశ్యప్, వేముగంటి.. ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు కథా రచయితల నామధేయాలే చిన్నపాటి గ్రంథం అవుతుంది.
నాడు చిన్న పిల్లలు నిద్రపోవడానికి తల్లిదండ్రులు లేదా నానమ్మ తాతయ్యాదులు చిన్నచిన్న కతలు చెప్పేవారు. తెలుగునాట ఎవరైనా సరే చిన్న పిల్లలకు, పెద్దలకు కథ చెప్పేటప్పుడు ‘అనగనగ..’ అని మొదలుపెడతారు. చిన్న పిల్లల్లో కథ అనగానే ముందుగా కథ వినాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ, ప్రశ్నించే తత్వం ఉం డదు. ఏది నిజం, ఏది అబద్ధం అనే ఆలోచనా జ్ఞానం ఉండదు. కల్పనా ప్రపంచంలో విహరించాలి అంతే. కొందరికి కథ కునుకు పట్టిస్తుంది కానీ, ఇది నిజం, ఇది అబ ద్ధం అనే ఆలోచనలను పెంచదు. కథ ల్లోని వాస్తవ, అవాస్తవాలను పక్కకు నెట్టేసి మనసును దేవుని మీదికి పోయేటట్టు చేస్తాయి గుడిలోని హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథల వంటి కథలు.
ఇక బడిలోని కథల గురించి చెప్పాలంటే.. అవి మంచిని, మానవత్వాన్ని, నీతిని, పెద్దల ఆదర్శాలను, చదువును సంస్కారాన్ని, సృజనాత్మకతను, సశాస్త్రీయ పథాన్ని తెలియజేసేవిగా ఉంటాయా? ఉన్నాయా? ఉండాలా? అంటే సమాధానం ఉండాలనే ఎక్కువగా వస్తుంది. నేడు సినిమా కథలే ఎక్కువగా కోట్ల వ్యాపారాల నడుమ ప్రకాశిస్తున్నాయి. కొందరు సినిమా కథలో ఏదో ఒక నీతి ఉండాలి, లేదా సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక సందేశం ఉం డాలంటున్నారు. అయితే మాట ఒకరకంగా ఉంటుంది. చేత మరొకరకంగా ఉంటుంది. సహజంగా ఉపాధ్యాయులు గానీ, పెద్దలు గానీ, పిల్లలు కానీ కథ మొదలు పెట్టేటప్పుడు ‘అనగన గా..’ అని అంటారు. అనగనగా అంటే ఏమిటంటే పూర్వం, చాలాకాలం కిందట వంటి అర్థాలను చెప్తా రు. ఇంగ్లీష్‌లో కూడా కథ మొదలు పెట్టేటప్పుడు Lo -ng Long ago అని అంటారు. అది ‘అనగనగా’ కు ఆంగ్ల రూపం అనే చెప్పవచ్చు.
నిజానికి కథ మొదలు పెట్టేటప్పుడు ముందుగా అనవలసింది ‘అనగనగా?’ అని కాదు, ‘అనఘనఘ’ అని అనాలి. వాడుకలో మహా ప్రాణాక్షరం ఘ..గ..గ మారిపోయి అనగనగా అయ్యింది. దానికి చాలాకాలం కిందట అనే అర్థం ఊహించి చెప్పబడింది.
నిజానికి అనగనగా అంటే పదబంధం ప్రకారం చెప్పగ చెప్పెగ అనే అర్థాన్ని చెప్పాలి. కానీ అలా చెప్ప డం లేదు. నిజానికి అఘం అంటే పాపం అని అర్థం. అనఘం అంటే పాపం కానిది పుణ్యం అని అర్థం. అనఘ అంటే ఓ పుణ్యాత్ముడని అర్థం. అనఘనఘ అంటే ఓ ఓ పుణ్యాత్ముల్లారా అని అర్థం. హరికథలు, బుర్రకథలు వంటివి చెప్పేటప్పుడు మాన్యులు, మహనీయులు, మహానుభావులు, పుణ్యాత్ములని సంబోధిస్తుంటారు. అలాగే కథ చెప్పేటప్పుడు కూడా ‘ఓ ఓ పుణ్యాత్ముల్లారా’ అని కథ చెప్పేవారు వినేవారిని సం బోధిస్తారు. ఆ ఉద్దేశంతోనే అనఘనఘ అనే పదబంధాన్ని పూర్వం సృష్టించారు. కానీ, ఉచ్ఛారణ ఆ పద బంధ అర్థానికే ప్రమాదం తెచ్చింది. ఎందరెందరో మహానుభావులు కథలు రాశారు, చెప్పారు. మంచి పేరు తెచ్చుకున్నారు. కథలు చెప్పేది పెద్దలు, వినేది పిల్లలు అంతే అనే దృష్టితో ‘అనఘనఘ’ని ‘అనగనగ’ చేసి ‘లాంగ్ లాంగ్ ఎగో’ అని ఆంగ్ల భాషా పండితుల చేత కూడా మన పండితులు అనిపించేశారు.
హరికథలు, బుర్రకథలు చెప్పేవారు ఇప్పటికీ వినేవారిలో చిన్నారులున్నా, పెద్దలున్నా, ఎవరున్నా మాన్యులు మహనీయులు, మహానుభావులు, పుణ్యాత్ములు అనే పదాలనే ప్రయోగిస్తుంటారు. కథ చెప్పేటప్పుడు కూ డా అనఘనఘ అనే కథ ప్రారంభించాలి. అంటే ఓ ఓ పుణ్యాత్ముల్లారా అని కథ వినేవారిని సంబోధించడం. తెలుగు సాహిత్యం లో మంచి మంచి అర్థాలతో ఇలాంటి పద ప్రయోగాలు కొన్ని ఉన్నాయి. వాటి అర్థం తెలుసుకొని ప్రయోగిస్తే మనం చెప్పే విష యం మహా అర్థవంతంగా ఉంటుంది.
– వాగుమూడి లక్ష్మీరాఘవరావు 62814 90160