అభినవ భగీరధుడై అలుపెరుగక చేసెను సాగు తాగు నీటికై ఘోర తపం
సాకారమైంది కాళేశ్వరం ఇంటింటికి చేరింది గోదావరి తేట జలం
మిషన్ కాకతీయ మిషతో కళను సంతరించుకున్న కాసారాలు
మత్తడి గా పారుతూ జలక్షీర మందిస్తుంటే
తన్మయత్వంతో తరి ఆందిస్తోంది వరి ధాన్యపుసిరి
పౌష్య లక్ష్మీ కళతో పరిఢవిల్లింది తెలంగాణ మాగాణం
కల్యాణ లక్ష్మి తో కాంతల మోములో ఆనందం
నేతన్నలకు చేయూతనిస్తూ చేనేతకు మెరుగులు దిద్ది
బతుకమ్మ చీరలిచ్చి ఆదబిడ్డల కంట ఆనందాన్ని ఆద్ది
ఆమ్మఒడి, విద్యార్దులకు చక్కనిబడి
రైతు బంధువై పెంచావు పంటల దిగుబడి
దళితబంధువై ఆంబేద్కరునిలా నిలబడి
ఆసరా గావుంటూ కంటికి వెలుగు పంచుతూ
హరిత హారాన్ని తెలంగాణ తల్లి మెడలో ఆలంకరించి
పచ్చదనాన్ని పెంచుతూ పుడమిని చల్లబరుస్తూ
ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి
అడుగంటిన భూగర్బ జలాన్ని పైకి నెట్టి
నీటి కటకటలను పక్కకు నెట్టి
విద్యుత్ కాంతులతో పల్లెలోని చీకట్లను పోగొట్టి
తెలంగాణ ఆంధకారంలో మగ్గుతుంది
అన్న వారి కుతంత్రాన్ని తిప్పికొట్టి
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ
బహుళజాతి సంస్దలకు కేంద్రంగా రాష్ట్రాన్ని దిక్సూచిగా చూపిస్తూ
పెట్టుబడులను ఆకర్షిస్తూ పెక్కుమందికి ఉపాధికల్పిస్తూ
సమీకృత పరిపాలన భవనాలద్వార పారదర్శక పాలన అందిస్తూ
నూతన సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకని శ్లాఘిస్తూ
భూ సంస్కరణల భరిణిగా ధరణీని మార్చేస్తూ
కోటి రతనాల వీణపై ఆశావాద గీతాన్ని పలికిస్తూ
దశాబ్ద సంబురాల సాక్షిగా అలుపెరుగని శ్రామికుడా
అదర్శ స్నాప్నికుడా దార్శనికత గల పాలకుడా
అంకిత భావంతో అకుంఠిత దీక్షతో స్పూర్తిని నింపే నాయకుడా
ఆబ్ కి బార్ కిసాక్ కీ సర్కార్ అని దృఢ సంకల్పంతో సమర శంఖాన్ని పూరిస్తూ
అప్రతి హతంగా సాగాలి విజయపధాన చంద్రశేఖరా
– శ్రీధర్ వాడవల్లి
హైదరాబాదు
9989855445