ఎండిపోయి గడ్డిపోసల్లే ఉన్న తెలంగాణను
పచ్చగసేసిన నీ కంటికి నిద్ర లేదంటే..
నీ పుట్టుక ఒక్క రాష్ట్రం కోసం కాదని
అమ్ముడువోతున్న దేశం
కోసమని మాకెర్కయింది…!!
మనిల్లు మంచిగుంటే సాలనుకునే
ఇంటి యజమానివి కాదు నువ్వు…
భారతదేశ నిర్మాణానికి పునాదులు వేయమని పంపిన తెలంగాణ తల్లి బిడ్డవు నువ్వు….!!
దేశ సంపద పరుల పాలు కాకుండా..
ప్రజలకి పంచిపెట్ట వచ్చిన దేశ్ కా నేతవు…..!!
నీకు కొట్లాడుడు కొత్తేం కాదు..
ఉత్తమాటలు చెప్పే నోరు కాదు నీది….!!
నువ్వు పిడికిలెత్తితే జనం కండ్లలో
గెలుపు కాగడాలు నిండుకుంటై….!!
తెలంగాణను భుజాన మోసిన నువ్వు…
భారతదేశాన్ని నెత్తినెత్తుకుని నడిచే
మల్లొక ఉద్యమకారుడివి కావాలె….
కాళేశ్వరం కట్టడాన్ని కాశ్మీర్ దాకా…
యాదాద్రి వైభవాన్ని అయోధ్య దాకా…
నీ పాలన పాఠాలతో…
నీ పథకాల ఫలితాలతో…
భారత ప్రజల భవిష్యత్తును మార్చే
దిక్చూచి నువ్వే….
రైతుల చేతుల పసిడి పంటల గీతలు
గీసే పరిపాలన రావాలి….!!
తెలంగాణ కారు గల్లీలో కాదు ఢిల్లీలో దూసుకెళ్లి మూసుకున్న అభివృద్ధి కళ్ళు తెరిపించు…..!!
భారత్ రాష్ట్ర సమితిలో
తెలంగాణను ఒక పాఠంగా వినిపించు…!!
భారత్ దేశ సిరిసంపదల కడ్డీని
సానవెట్టి దేశ ప్రజలందరికి వడ్డించు…..!!
‘పేదరికాన్ని మంటగలిపే
భారత్ రాష్ట్ర సమితి పేరు
ముందు తరాలు బలపంతో దిద్దేలా
నాంది పూరించండి సార్….!
తుమ్మల ,కల్పన రెడ్డి
96404 62142