పల్లవి: ఎట్లుండెరా గోస ఎట్లుండెరా
తెలంగాణ రాకముందు ఎట్లుండెరా
గిట్లుండెనా గింత మంచిగుండెనా
దారి పొడుగునా ధాన్య రాసులుండెనా!
చరణం: నీళ్ళుండెనా బోరు సుక్కపోసెనా
మాగాణి యెంతున్నా మడి పారెనా
ఇట్లుండెనా కరెంటిట్లుండెనా
ఇరువై నాల్గంటలూ వుంటుండెనా ॥ఎట్లు॥
చరణం: చెరువులుండినా బొట్టు నీళ్ళుండెనా
నీళ్ళు మలుపుకొందమంటె నిధులుండెనా
కరువుదీరే కాకతీయ మిషనుండెనా
కంటిచూపు చూసినంత పైరు పండెనా ॥ఎట్లు॥
చరణం: ఎత్తిపోతలు పోసె ఏలికుండెనా
ఏడాది పోడుగంత జాలు ఉండెనా
కాళేశ్వరము కట్ట కాలువలుండెనా
నిండుకుండలెన్నో రిజర్వాయర్లుండెనా ॥ఎట్లు॥
చరణం: తాగునీటి తండ్లాట ఎట్లుండెరా
యింటింటి నల్లాలు ఇట్లుండెనా
బిందెల కొట్లాట ఎట్లుండెరా
భగీరథ లేని ఇల్లు ఇపుడుండెనా ॥ఎట్లు॥
చరణం: బీముండెనా రైతుకు ధీముండెనా
సచ్చిపోతె ఒక్కపైస వచ్చుండెనా
పెట్టుబడి సాయంబు పేరుండెనా
రైతుబంధు యిచ్చెటి రాజుండెనా ॥ఎట్లు॥
అన్నల్దాస్ ,రాములు
99495 53655