నా హృదయంలో నా ప్రాణంలో…
ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి,
కొంత జాగా చేసి వుంచాను!
ఎవరికి తెలుసు
నవ్వుతూనే, నవ్విస్తూనే
నేను ఇవ్వడం ఇష్టం లేక…
ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?!
గుండెమీద బరువుంది
తలమీద బరువుంది
నడవలేకుండా కాళ్ళకు
బంధాల బరువుంది
అయినా, ఎవరైనా
ఎక్కడా యే ఆసరా లేని వాళ్ళు
అలసిపోతే.. ఆగిపోతే
తల ఆన్చు కోవడానికి
నా భుజాన్ని ఖాళీగానే పెట్టాను!
గాయాలతో స్నేహం చేసేవాడికి
నొప్పి ఆప్తంగానే వుంటుంది.
ఆశారాజు
9392302245