తినకుండా ఉంటే
ఉన్నోడికి ఉపవాసం
లేనోడికి పస్తు!
పాపం పోవాలనో
పుణ్యం రావాలనో
ఉన్నోడి ఆలోచన!
అయ్యో రామ
అన్నం దొరకలేదే అని
పేదోడి ఆవేదన!
ఇద్దరికీ దేవుడొక్కడే
మరి ఈ వివక్ష ఏమిటో
చేసిన పాప పుణ్యాలా!
అయితే స్వామి!
తప్పులు చేయకుండా చూడలేవా
చేస్తే అప్పటికప్పుడే శిక్షించలేవా!
పాపాలను మూటగట్టి
నుదుటి మీద రాతగా రాస్తే
మానవుడికేమి జ్ఞాపకం!
ఎప్పటికప్పుడు శిక్షిస్తే
బెత్తంతో సరిపోతుంది
అన్నీ కలిపితే జీవితమైనా సరిపోతుందా!
జి. జగ్గయ్య
98495 25802